Page Loader
ప్రియురాలిని హత్య చేసి, మృతదేహాన్ని ప్రిజ్‌లో పెట్టి; అదేరోజు మరో అమ్మాయితో పెళ్లి
ప్రియురాలిని హత్య చేసి అదేరోజు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్న యువకుడు

ప్రియురాలిని హత్య చేసి, మృతదేహాన్ని ప్రిజ్‌లో పెట్టి; అదేరోజు మరో అమ్మాయితో పెళ్లి

వ్రాసిన వారు Stalin
Feb 15, 2023
11:32 am

ఈ వార్తాకథనం ఏంటి

ఓ యువకుడు తన ప్రియురాలిని హత్య చేసి, అదే రోజు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఘటన దిల్లీలో మిత్రోన్ గ్రామంలో జరిగింది. ఈ హత్యకు సంబంధించి దిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితుడిని సాహిల్ గెహ్లాట్ (24)గా, మృతురాలిని నిక్కీ యాదవ్‌గా గుర్తించినట్లు పోలీసుల తెలిపారు. కొన్నేళ్లుగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని, ఈ ఘటన ఫిబ్రవరి 9,10 మధ్య రాత్రి జరిగినట్లు వెల్లడించారు. ఆ రోజు రాత్రి తన కారులో మొబైల్ కేబుల్ సహాయంతో నిక్కీ గొంతు నులిమి సాహిల్ హత్య చేసి, మృతదేహాన్ని దిల్లీలోని మిత్రాన్ గ్రామంలో ఉన్న అతని దాబాలోని ఫ్రిజ్‌లో ఉంచాడని పోలీసులు తెలిపారు.

దిల్లీ

పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య గొడవ

ఫిబ్రవరి 10న జరిగిన ఈ సంఘటన గురించి తమకు సమాచారం అందిందని స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రవీంద్ర సింగ్ యాదవ్ చెప్పారు. ఆ తర్వాత పరారీలో ఉన్న సాహిల్‌ను దిల్లీలోని కైర్ క్రాసింగ్ వద్ద పట్టుకున్నామని వెల్లడించారు. విచారణలో సాహిల్ నేరాన్ని ఒప్పుకున్నట్లు రవీంద్ర సింగ్ వివరించారు. సాహిల్‌ మరో మహిళను వివాహం చేసుకోబోతున్నట్లు బాధితురాలు తెలుసుకుంది. ఈక్రమంలో ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్‌షిప్ గురించి తన తల్లిదండ్రులకు చెప్పాలని సాహిల్‌ను నిక్కీ కోరింది. నిక్కీతో పెళ్లికి సాహిల్ సిద్ధంగా లేకపోవడంతో ఇద్దరి మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో పెళ్లిరోజు ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా ఆవేశంతో అతడు ఆమెను కేబుల్ వైర్‌తో హత్య చేసినట్లు పోలీసులు చెప్పారు.