జ్ఞానవాపి సర్వే: మీడియా కవరేజీని నిషేధించాలని కోర్టును ఆశ్రయించిన ముస్లిం పక్షం
ఉత్తర్‌ప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లో భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) చేపడుతున్న శాస్త్రీయ సర్వే బుధవారం కూడా కొనసాగుతోంది. అయితే ఈ సర్వేపై మీడియా కవరేజీపై నిషేధం విధించాలని కోరుతూ ముస్లిం పిటిషనర్లు జిల్లా కోర్టు న్యాయమూర్తికి దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు అనుమతి లేకుండా సర్వేకు సంబంధించిన ప్రతి సమాచారం మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం అవుతోందని ముస్లిం పక్షం పిటీషనర్లు తన దరఖాస్తులో పేర్కొన్నారు. మీడియా కవరేజీ సర్వేను తప్పుదోవ పట్టిస్తుందని, ఇది ప్రజల అభిప్రాయాన్ని ప్రభావితం చేస్తుందని, అందుకే నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటీషనర్లు అన్నారు.
3డీ ఇమేజింగ్ పరికరాలతో మసీదు కాంప్లెక్స్‌ను కొలుస్తున్న ఏఎస్ఐ బృందం
ఏఎస్‌ఐ నిర్వహించిన సర్వేను ఆపాలని ముస్లిం పక్షం మరోసారి జిల్లా కోర్టులో పిటిషన్ వేసింది. సర్వేలో భాగంగా మంగంళవారం ఏఎస్ఐ బృందం జ్ఞానవాపి కాంప్లెక్స్ గోపురాలు, నేలమాళిగను కొలిచింది. ఉత్తర గోడలను కూడా సర్వే చేసింది. 3డీ ఇమేజింగ్ పరికరాలతో సహా యంత్రాలతో ప్రాంతాలను కొలుస్తోంది. కాంప్లెక్స్ మొత్తంగా కెమెరాల్లో పురావస్తు అధికారులు బంధిస్తున్నారు. ఏఎస్ఐ బృందం మూడు గ్రూపులుగా విడిపోయి కాంప్లెక్స్‌లో సర్వే చేస్తున్న పరిస్థితి నెలకొంది.