
Bihar: బిహార్ ఎన్నికల వేళ మటన్ రాజకీయాలు..ఎన్‌డిఎ మీట్ మెనూపై విమర్శలు గుప్పించిన తేజస్వి యాదవ్
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. అధికార జేడీయూ-భాజపా కూటమి,ప్రతిపక్ష ఆర్జేడీ మధ్య మాటల యుద్ధం తీవ్రంగా నడుస్తోంది. రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించేందుకు ఎలాంటి అవకాశం వదలడంలేదు. ఈ నేపథ్యంలో తాజాగా బిహార్ రాజకీయాల్లో 'మటన్ పాలిటిక్స్' అనే అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రతిపక్ష నాయకుడు, ఆర్జేడీ ప్రముఖుడు తేజస్వీ యాదవ్ ఇటీవల ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. పట్నాలో ఇటీవల జరిగిన ఎన్డీయే సమావేశానికి సంబంధించిన ఆ వీడియోలో మటన్ అనే లేబుల్‌తో ఉన్న ఓ పాత్ర కనిపించింది. ఇది శ్రావణమాసంలో రెండో సోమవారం వడ్డించబడిందని పేర్కొంటూ తేజస్వీ, భాజపా నేతలపై తీవ్రంగా విమర్శలు చేశారు.Embed
వివరాలు
భాజపా మంత్రులు, ఎమ్మెల్యేలు శ్రావణ సోమవారం మటన్ విందు
తాజాగా తేజస్వీ యాదవ్ తన 'ఎక్స్' (మాజీ ట్విట్టర్) ఖాతాలో స్పందిస్తూ, ''ప్రధాని నరేంద్ర మోదీ ఆశీర్వాదంతో భాజపా మంత్రులు, ఎమ్మెల్యేలు శ్రావణ సోమవారం మటన్ విందు చేశారు'' అని ధ్వజమెత్తారు. బిహార్ మంత్రివర్గంలో ముగ్గురు మంత్రులు ప్రతిరోజూ కేజీ మటన్ తింటారని, అదే సమయంలో సనాతన ధర్మంపై పొడవైన ఉపన్యాసాలు ఇస్తారని వ్యంగ్యంగా విమర్శించారు. ఆహారపు అలవాట్లపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసిన తేజస్వీ, ప్రధాని మోదీకి తమ పార్టీ నేతలు మటన్ తినడం ఓకే. కానీ అదే విషయాన్ని ప్రతిపక్ష నేతలపై వచ్చినప్పుడు పెద్ద సమస్యగా మారుస్తూ, అసత్య ప్రచారం చేయడంలో కూడా తాను వెనకాడటం లేదు'' అని ప్రధానిపై ఆరోపించారు.
వివరాలు
ప్రధానిని లక్ష్యంగా చేసుకుని తేజస్వీ యాదవ్ విమర్శలు
ఇంతకుముందు కూడా తేజస్వీ యాదవ్ ఆహారపు అలవాట్లు బీజేపీ టార్గెట్‌గా మారిన సందర్భాలున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల ముందు వసంత నవరాత్రి సమయంలో తేజస్వీ చేపలు తిన్నారంటూ భాజపా తీవ్రంగా మండిపడింది. దీనిపై స్పందించిన తేజస్వీ, తనను 'సీజనల్ సనాతన వాది'గా అభివర్ణించిన విమర్శలను ఎదిరించారు. ఇప్పటికే గత వారం కేంద్ర మంత్రి, జేడీయూ నేత రాజీవ్ రంజన్‌సింగ్ ఏర్పాటు చేసిన మటన్ పార్టీకీ తేజస్వీ తీవ్రంగా స్పందించారు. ఆయన విమర్శలు నేరుగా ఎన్డీయే కూటమిని, ప్రధానిని లక్ష్యంగా చేసుకుని సాగినవే. తాజా పరిణామాలతో బిహార్‌లో ఎన్నికల ముందు మటన్ రాజకీయాలు మరింత వేడి రేపుతున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
తేజస్వీ యాదవ్ చేసిన ట్వీట్
प्रधानमंत्री श्री @narendramodi जी के असीम आशीर्वाद और कृपा से सावन के सोमवारी को दबा कर मटन 🥩 चापते बीजेपी के मंत्री और विधायक।
— Tejashwi Yadav (@yadavtejashwi) July 21, 2025
मोदी जी की कैबिनेट में बिहार से तीन ऐसे मंत्री है जो सावन में भी प्रतिदिन 3 किलो मटन खाते है लेकिन दिखावटी तौर पर सनातन पर लंबा चौड़ा ज्ञान देते है।… pic.twitter.com/NuvuOwEzKy