Loading...
Nagababu: నాగబాబుకు కీలక బాధ్యతలు.. గ్రీన్ కమిటీ ఛైర్మన్‌గా నియామకం
నాగబాబుకు కీలక బాధ్యతలు.. గ్రీన్ కమిటీ ఛైర్మన్‌గా నియామకం

Nagababu: నాగబాబుకు కీలక బాధ్యతలు.. గ్రీన్ కమిటీ ఛైర్మన్‌గా నియామకం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 17, 2026
12:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జనసేన ఎమ్మెల్సీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబుకు కీలక బాధ్యతలు అప్పగించింది. ఏపీ గ్రీన్‌ కార్యనిర్వాహక కమిటీ (Green Executive Committee) ఛైర్మన్‌గా ఆయనను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర పర్యావరణ, అటవీశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవితో నాగబాబుకు కేబినెట్‌ హోదా కల్పించింది.

వివరాలు 

పచ్చదనం పెంపు.. పర్యావరణ పరిరక్షణ

రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనాన్ని పెంచడం,పర్యావరణ సమతుల్యతను కాపాడటం, అడవుల విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వడం గ్రీన్‌ కార్యనిర్వాహక కమిటీ ప్రధాన లక్ష్యాలు.

ఇకపై ఈ కమిటీకి నాగబాబు నాయకత్వం వహించనున్నారు.

ఆయన నేతృత్వంలో కమిటీ రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించనుంది.

పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు పర్యవేక్షణను మరింత వేగవంతం చేయనుంది.

భారీ స్థాయిలో చేపట్టే మొక్కల పెంపకం, నాటే ప్రాజెక్టుల అమలును కూడా కమిటీ పరిశీలించనుంది.

పర్యావరణానికి మేలు చేసేలా కీలక కార్యక్రమాలను రూపొందించడం, వాటి అమలును పర్యవేక్షించడంలో నాగబాబు నేతృత్వంలోని గ్రీన్‌ కార్యనిర్వాహక కమిటీ ముఖ్య భూమిక పోషించనుంది.

రాష్ట్రంలో పచ్చదనాన్ని విస్తరించడం, పర్యావరణ సమతుల్యతను కాపాడే చర్యలను మరింత సమర్థంగా ముందుకు తీసుకెళ్లడంపై కమిటీ దృష్టి సారించనుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు కేబినెట్ హోదా

ADVERTISEMENT