LOADING...
Nagarjuna: ఏఎన్నార్‌ కళాశాల విద్యార్థుల ఉపకార వేతనాల కోసం రూ.2 కోట్లు: నాగార్జున  
ఏఎన్నార్‌ కళాశాల విద్యార్థుల ఉపకార వేతనాల కోసం రూ.2 కోట్లు: నాగార్జున

Nagarjuna: ఏఎన్నార్‌ కళాశాల విద్యార్థుల ఉపకార వేతనాల కోసం రూ.2 కోట్లు: నాగార్జున  

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 17, 2025
12:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

తన తండ్రి, లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్‌)కు చదువు లేకపోయినా, విద్య విలువను గుర్తించి అనేకమందికి మంచి భవిష్యత్తు అందించాలనే లక్ష్యంతో పనిచేశారని ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తెలిపారు. కృష్ణా జిల్లా గుడివాడలోని ఏఎన్నార్‌ కళాశాల వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన, కళాశాల ప్రాంగణంలో నిర్మించిన రూసా భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, 1959 సంవత్సరంలో కళాశాల అభివృద్ధి కోసం తన తండ్రి ఏఎన్నార్‌ రూ.లక్ష విరాళంగా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

వివరాలు 

మంచి పనులే చిరస్థాయిగా నిలుస్తాయి 

విద్యార్థుల చదువుకు తోడ్పాటుగా స్కాలర్‌షిప్‌ల నిమిత్తం తమ కుటుంబం తరఫున రూ.2 కోట్ల విరాళాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు. మనుషులు శాశ్వతం కాదని, కానీ వారు చేసే మంచి పనులే చిరస్థాయిగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఏఎన్నార్‌ కళాశాల విద్యార్థుల స్కాలర్‌షిప్‌లకు రూ.2 కోట్ల విరాళం: నాగార్జున

Advertisement