Page Loader
Nandini milk: అమూల్ కి పోటీగా దిల్లీ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న నందిని పాలు ..
Nandini milk: అమూల్ కి పోటీగా దిల్లీ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న నందిని పాలు ..

Nandini milk: అమూల్ కి పోటీగా దిల్లీ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న నందిని పాలు ..

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 20, 2024
05:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రముఖ డెయిరీ బ్రాండ్‌ "నందిని" దిల్లీ మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధమైంది. ఈ నెల 21న ఈ బ్రాండ్‌ దిల్లీ వినియోగదారుల కోసం పాలు, పెరుగు వంటి కొన్ని ఉత్పత్తులను విడుదల చేయనుంది. ఈనెల 21వ తేదీన ఆర్డర్‌లను ప్రారంభించి, దిల్లీ ప్రజలకు నందిని ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురానుంది. అలాగే, బెంగళూరు మార్కెట్‌లో ఉన్నఇడ్లీ, దోశ పిండిని కూడా అందుబాటులోకి తీసుకురానుందని కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌ ఎండీ ఎంకే జగదీష్‌ తెలిపారు.

వివరాలు 

పలు రాష్ట్రాలలో నందిని ఉత్పత్తులు

ప్రస్తుతం కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, హైదరాబాద్‌, చెన్నై, కేరళ వంటి రాష్ట్రాలలో నందిని ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు, దిల్లీలో అడుగుపెట్టి ఉత్తర భారతదేశంలో ప్రవేశించనుంది. ప్రస్తుతం, ఈ ప్రాంతాలలో అమూల్‌, మదర్‌ డెయిరీ, మధుసూదన్‌, నమస్తే ఇండియా వంటి బ్రాండ్లతో విపరీతమైన పోటీ ఉన్నది. ఇప్పుడు, నందిని ఈ బ్రాండ్లకు ప్రత్యామ్నాయం ఆఫర్ చేస్తూ, మార్కెట్‌లో పోటీకి దిగనుంది. ఈ మేరకు, మండ్య నుండి దిల్లీకి పాల సరఫరాకు సంబంధించి ట్యాంకర్ల కోసం టెండర్లను ఆహ్వానించారు.

వివరాలు 

నందిని నుండి  ఐడీ వంటి సంస్థలకు పోటీ 

ఇంతకుముందు, కర్ణాటక ఎన్నికల సమయంలో, అమూల్‌, నందిని బ్రాండ్ల మధ్య రాజకీయ వివాదం నెలకొన్న విషయం తెలిసినదే. బెంగళూరు మార్కెట్‌లో అమూల్‌ ప్రవేశించినప్పుడు, కాంగ్రెస్‌ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనివల్ల నందిని బ్రాండ్‌ కు భవిష్యత్తులో సవాలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ అభిప్రాయపడింది. ఇప్పుడు, దిల్లీ మార్కెట్‌లోకి నందిని ప్రవేశించటం ఎంతో విశేషం. మరోవైపు, ఇడ్లీ, దోశ పిండిని విక్రయించడం ద్వారా ప్రైవేట్ కంపెనీలకు, ముఖ్యంగా ఐడీ వంటి సంస్థలకు పోటీ ఇచ్చే అవకాశముంది.