Page Loader
'చంద్రబాబు అరెస్ట్ వార్తలు చూసినా కేసులు పెడతారమో'.. పోలీసులపై లోకేశ్ సెటైర్
చంద్రబాబు అరెస్ట్ వార్తలు చూసినా కేసులు పెడతారమో.. పోలీసులపై లోకేశ్ సెటైర్

'చంద్రబాబు అరెస్ట్ వార్తలు చూసినా కేసులు పెడతారమో'.. పోలీసులపై లోకేశ్ సెటైర్

వ్రాసిన వారు Stalin
Oct 02, 2023
01:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు 'మోత మోగిద్దాం' కార్యక్రమానికి నారా బ్రాహ్మణి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దాదాపు 60 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసారు. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఫైర్ అయ్యారు. విజిల్స్ వేసి సౌండ్ చేశారని 60మందిపై కేసా పెడతారా? అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. దీనికి కూడా పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారిస్తారా? ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏపీ పోలీసుల తీరు చూస్తుంటే టీవీలో చంద్రబాబు అరెస్ట్ వార్తలు చూసినందుకు, పసుపురంగు దుస్తులు ధరించినందుకు, సైకిల్ బ్రాండ్ అగర్ బత్తీలు అంటించినందుకు కూడా కేసులు నమోదు చేసేలా ఉన్నారని లోకేశ్ సెటైర్ విసిరారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

లోకేశ్ చేసిన ట్వీట్