Nara Lokesh: జనానికి అందుబాటులో లోకేష్.. గతానికి భిన్నంగా పని తీరు
గతానికి భిన్నంగా పని చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ దూసుకు వెళుతున్నారు. ప్రజా దర్బార్ లో ప్రజల సమస్యలను సావధానంగా వింటున్నారు. ప్రజలకు సేవ చేయాలనే అంకితభావాన్ని ప్రదర్శిస్తూ మంత్రి నారా లోకేష్ శనివారం మాత్రమే కాకుండా ఆదివారం కూడా ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అహర్నిశలు శ్రమిస్తూ పాలనలో తనదైన ముద్ర వేస్తున్న యువనేతతో మంగళగిరి పౌరులు కలిసి తమ సమస్యలపై చర్చించారు.
2,193 మందిని రెగ్యులరైజ్ చేయాలని లోకేష్‌కు విజ్ఞప్తి
డీఎస్సీ-2008, జీవో నంబర్ 39 ప్రకారం ఎంటీఎస్ కాంట్రాక్టు కింద పనిచేస్తున్న 2,193 మందిని రెగ్యులరైజ్ చేయాలని దర్బార్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ సభ్యులు మంత్రి లోకేష్‌కు విజ్ఞప్తి చేశారు. జగదీష్ అనే విద్యార్థి నూజివీడు కళాశాలలో పాలిటెక్నిక్ సర్టిఫికెట్లు పొందేందుకు సహకరించాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యల కారణంగా నిలుపుదల చేశారు.