
Nara Lokesh: మంగళగిరిలో టాటా హిటాచీ షోరూం ప్రారంభించిన నారా లోకేశ్
ఈ వార్తాకథనం ఏంటి
గత ప్రభుత్వం బుల్డోజర్లను విధ్వంసానికి ఉపయోగించిందని, అయితే ప్రజా ప్రభుత్వం వాటిని అభివృద్ధి సాధనాలుగా మలుస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో టాటా గ్రూప్‌కు చెందిన హిటాచీ షోరూంను ఆయన ప్రారంభించారు.
వివరాలు
మంగళగిరిలో జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్
"బుల్డోజర్లు కేవలం కూల్చివేతకు మాత్రమే కాదు, అభివృద్ధి పనులకు కూడా ఉపయోగపడతాయని మా ప్రభుత్వం చూపిస్తోంది. ఓటమి ఎదురైనా, మంగళగిరిని విడిచి వెళ్లాలనే ఆలోచన ఎప్పుడూ రాలేదు. ఈ ప్రభుత్వంలో మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి పనికి ప్రాధాన్యం ఉంది. ప్రజలు నాపై ఉంచిన విశ్వాసం, ఇచ్చిన మెజారిటీ ఫలితంగా ఇక్కడ ఎప్పుడూ లేని అభివృద్ధి జరుగుతోంది. మంగళగిరిలో జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ఏర్పాటుపై దృష్టి సారించాం. టాటా హిటాచీతో పాటు, దానికి అనుబంధ సంస్థలను లక్ష్మీ గ్రూప్ ఇక్కడే నెలకొల్పాలని ప్రణాళిక ఉంది," అని లోకేశ్ అన్నారు.
వివరాలు
గతంలో ఎన్నడూ లేని విధంగా పెట్టుబడులు: కంభంపాటి రామ్మోహన్‌రావు
"గతంలో ఎన్నడూ లేని రీతిలో రాష్ట్రంలో పెట్టుబడులు ప్రవేశిస్తున్నాయి. ఇందుకు చంద్రబాబు నాయుడు, లోకేశ్ నాయకత్వమే ప్రధాన కారణం.యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఎన్టీఆర్ ఇచ్చిన ప్రోత్సాహం వల్లే లక్ష్మీ గ్రూప్ విస్తరించి, ప్రస్తుతం సుమారు 6 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించగలిగింది," అని కంభంపాటి రామ్మోహన్‌రావు తెలిపారు.