
Nara lokesh: ఎవర్ వోల్ట్ ఛైర్మన్ సైమన్ టాన్ తో లోకేశ్ భేటీ.. ఏపీలో సోలార్ సెల్ యూనిట్ ఏర్పాటుకు విజ్ఞప్తి
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రిగా ఉన్న నారా లోకేశ్ కూడా ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా మంత్రి లోకేశ్ ఈ రోజు ఎవర్‌వోల్ట్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చైర్మన్ సైమన్ టాన్‌తో సమావేశమయ్యారు.
వివరాలు
2029 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 160 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్ధ్యం
ఈ భేటీలో ఆయన పలు ముఖ్యమైన ప్రతిపాదనలు చేశారు.ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, "2029 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 160 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. ఈ దిశగా 'ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ-2024'ను ప్రకటించాం. ఇప్పటికే రెన్యూ, సుజలాన్ వంటి ప్రముఖ కంపెనీలు తమ కార్యకలాపాలను రాష్ట్రంలో ప్రారంభించాయి. ఇలాంటి వాతావరణంలో ఏపీలో పెద్దస్థాయిలో సోలార్ సెల్స్, మాడ్యూల్స్, బ్యాటరీ తయారీ యూనిట్లను ఏర్పాటు చేయాలని కోరుతున్నాం" అని పేర్కొన్నారు. అదే విధంగా,రాష్ట్రంలో ఆధునిక సౌరశక్తి నిల్వ సాంకేతికత అభివృద్ధికి ఎవర్ వోల్ట్ సంస్థ తమ పరిశోధన,అభివృద్ధి కేంద్రాన్ని(R&D Center)ఏర్పాటు చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
వివరాలు
ఐటీఐలో రెన్యువబుల్ ఎనర్జీ నైపుణ్యశిక్షణకు అంగీకారం
అంతేగాక,రాష్ట్రంలోని ఐటీఐలలో పునరుత్పాదక ఇంధన రంగంలో నైపుణ్యాల అభివృద్ధికి శిక్షణ కార్యక్రమాలను అందించేందుకు సహకరించాలని కోరారు. ఈఅభ్యర్థనలపై స్పందించిన ఎవర్ వోల్ట్ ఛైర్మన్ సైమన్ టాన్ మాట్లాడుతూ,ఏపీప్రభుత్వం ఎంపిక చేసే ఒక ఐటీఐలో పునరుత్పాదక ఇంధనంపై ప్రత్యేక నైపుణ్య శిక్షణను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. బెంగళూరును ప్రధాన కార్యాలయంగా కలిగిన ఎవర్ వోల్ట్ సంస్థ సోలార్ సెల్స్,మాడ్యూల్స్,రూఫ్‌టాప్ సొల్యూషన్స్,ఎనర్జీ స్టోరేజ్ పరికరాల తయారీలో ప్రత్యేకత కలిగినదిగా ఆయన వివరించారు. తమసంస్థ ఈసంవత్సరం మార్చినాటికి 1గిగావాట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకుందని,2026 నాటికి దీన్ని 3గిగావాట్లకు విస్తరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని తెలిపారు. చివరగా,ఏపీలో యూనిట్ ఏర్పాటు చేసే అంశాన్ని తమ అత్యున్నత బృందంతో చర్చించి,ఆ అవకాశాలను పరిశీలిస్తామని సైమన్ టాన్ హామీ ఇచ్చారు.