National Herald case: 'న్యాయమే గెలిచింది'.. ప్రధాని మోదీ, అమిత్ షా రాజీనామా చేయాలి: నేషనల్ హెరాల్డ్ కేసుపై ఖర్గే
ఈ వార్తాకథనం ఏంటి
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీకి ఊరట కలిగింది. ఈ కేసుకు సంబంధించి ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకోవడానికి దిల్లీ హైకోర్టు నిరాకరించడంతో, కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు లాభం చేకూరింది. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. న్యాయం గెలిచిందని పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నేషనల్ హెరాల్డ్ కేసు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపుతోనే పెట్టినదని ఆరోపించారు. 1938లో స్వాతంత్ర్య సమరయోధులు స్థాపించిన నేషనల్ హెరాల్డ్ పత్రికను కేంద్ర ప్రభుత్వం ఒక కారణంగా చేసుకుని, సీబీఐ,ఈడీ వంటి సంస్థలను ఉపయోగించి కాంగ్రెస్ నాయకులను,ముఖ్యంగా గాంధీ కుటుంబాన్ని వేధించే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు.
వివరాలు
కక్ష సాధింపు రాజకీయాల నిజస్వరూపాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తాం: ఖర్గే
ఈ కేసులో వాస్తవంగా ఎలాంటి బలం లేదని ఖర్గే పేర్కొన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడుతూ, నేషనల్ హెరాల్డ్ వ్యవహారం కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగానికి స్పష్టమైన ఉదాహరణ అని అన్నారు. ఇక, కక్ష సాధింపు రాజకీయాల నిజస్వరూపాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తామని పార్టీ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు.