Maharastra: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్.. సపోర్ట్ ఇచ్చిన ఎన్సీపీ చీఫ్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి అద్భుత విజయాన్ని సాధించింది. ఈ విజయం అనంతరం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి కూటమి నేతలు సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో "ముఖ్యమంత్రి ఎవరు?" అనే ప్రశ్న ఇప్పుడు కీలకంగా మారింది. దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండే వీరిద్దరూ సీఎం పదవి కోసం పోటీపడుతున్నారు, అందువల్ల ఎవరు సీఎం పీఠాన్ని దక్కించుకుంటారన్నది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
దేవేంద్ర ఫడ్నవీస్ ను సీఎం చేయవద్దని వాదిస్తున్న బీజేపీలో కొందరు
ఈ క్రమంలో,మహారాష్ట్రలోని తదుపరి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్‌ను అజిత్ పవార్ మద్దతు ఇచ్చారని సమాచారం. ఆదివారం జరిగిన సమావేశంలో ఫడ్నవీస్‌ను సీఎం చేసేందుకు అజిత్ పవార్,ఆయన ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించినట్లు సమాచారం. 288 సీట్లకు జరిగిన ఎన్నికల్లో మహాయుతి కూటమి 235 సీట్లు సాధించి ఘనవిజయం సాధించింది. అందులో బీజేపీ 132 సీట్లతో ప్రధాన పార్టీగా నిలిచింది. 145 సీట్లు సాధించాలంటే బీజేపీ దానికి చాలా దగ్గరగా ఉంది, ఈ నేపథ్యంలో, బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కావాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ, బీజేపీ లోని కొంతమంది నేతలు మాత్రం ఏక్‌నాథ్ షిండేనే సీఎం కావాలని అభ్యర్థిస్తున్నారు. ఈ అస్థిరత 24 గంటల్లో సులభంగా వీడిపోయే అవకాశం ఉంది.
21 మంది మంత్రులతో కూడిన మంత్రివర్గం
ఇక మరోవైపు, శివసేన (షిండే వర్గం) నుండి మంత్రి దీపక్ కేసర్కర్ ప్రకటించారు. నేడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేస్తారని తెలుస్తోంది. మొదటి విడుతలో 21 మంది మంత్రులతో కూడిన మంత్రివర్గం ఏర్పడే అవకాశముందని సమాచారం. రాజ్యాంగ నిబంధనల ప్రకారం, 43 మంది మంత్రులు కేటాయించవచ్చు, అందులో 21 మంది బీజేపీ నుంచి, 12 మంది శివసేన (షిండే) నుండి, 10 మంది ఎన్సీపీ (అజిత్) నుండి మంత్రులుగా నియమించబడే అవకాశం ఉన్నట్లు సమాచారం.