అజిత్ పవార్‌తో పాటు మరో 8మంది రెబల్స్‌పై అనర్హత పిటిషన్ దాఖలు చేసిన ఎన్సీపీ
ఈ వార్తాకథనం ఏంటి
అజిత్ పవార్ ఉదంతంతో మహారాష్ట్ర రాజాకీయ రసవత్తరంగా మారింది. ఎన్‌సీపీ సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది.
ఏకనాథ్ షిండే నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణం చేసిన అజిత్ పవార్‌తో పాటు మరో ఎనిమిది మందిపై తమ పార్టీ అనర్హత పిటిషన్‌ను దాఖలు చేసినట్లు రాష్ట్ర ఎన్‌పీపీ చీఫ్ జయంత్ పాటిల్ పేర్కొన్నారు.
ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్‌కు అనర్హత పిటిషన్ పంపినట్లు ఆయన తెలిపారు.
ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు అన్ని జిల్లాల పార్టీ కార్యకర్తలు అండగా ఉన్నారని పేర్కొంటూ తీర్మానాల లేఖలతో ఎన్సీపీ ఎన్నికల సంఘాన్ని కూడా ఆశ్రయించింది.
కేవలం తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఒక పార్టీ కాలేరని జయంత్ పాటిల్ స్పష్టం చేశారు.
మహారాష్ట్ర
శరద్ పవార్ సూచనల మేరకే రెబల్స్‌పై వేటు: ఎన్సీపీ
శరద్ పవార్ సూచనల మేరకే అజిత్ పవార్ సహా తొమ్మిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ దాఖలు చేసినట్లు ఎన్సీపీ వర్గాలు పేర్కొన్నాయి.
1999లో శరద్ పవార్ ఎన్సీపీని స్థాపించారు. ఇప్పుడు ఆయన మేనల్లుడు అజిత్ పవార్ శివసేన-బీజేపీ ప్రభుత్వంలో చేరి పార్టీలో చీలికకు కారణమయ్యారు.
ఛగన్ భుజ్‌బల్, దిలీప్ వాల్సే పాటిల్ వంటి శరద్ పవార్ వీర విధేయులు కుడా అజిత్ వెంట నడవటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇదిలా ఉండగా, ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే మాట్లాడుతూ, పార్టీలో జరుగుతున్న పరిణామాలు ప్రతిపక్షాల ఐక్యతను ప్రభావితం చేయవని అన్నారు.