Chandrababu Naidu: ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబును ఎనుకున్న ఎన్డీయే కూటమి
ఆంధ్రప్రదేశ్‌లో తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డీఏ) మంగళవారం ఎన్నుకుంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, నాయుడు ఇతర పార్టీ సభ్యులతో కలిసి జూన్ 12 న ఉదయం 11.27 గంటలకు గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదిలా ఉండగా కేబినెట్ కూర్పుపై ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో పాటు బీజేపీ నేతలతోనూ చర్చించారు. సామాజిక సమీకరణాలు,సీనియర్లు,మహిళలతో పాటు పార్టీకి నిబద్దతగా పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇచ్చే ఆలోచన చేస్తున్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారిలోనూ పలువురికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబు పేరును ప్రతిపాదించిన జనసేనాని
భారీగా ఎమ్మెల్యేలు గెలవడంతో కేబినెట్ కూర్పు కత్తిమీద సాములా మారింది. ఈ నేపథ్యంలో కూటమి కట్టడానికి, కూటమి విజయానికి పవన్ కల్యాణే కారణమని చెబుతున్న చంద్రబాబు.. ఆయనకు ఏ పదవి ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. విజయవాడలో ఎన్‌డిఎ సమావేశాన్ని నిర్వహించింది.ఆ భేటీలో మిత్రపక్షాలు టిడిపి, బీజేపీ,జనసేన కలిసి చంద్రబాబు నాయుడిని అసెంబ్లీలో తమ నాయకుడిగా ఎన్నుకున్నాయి. ఆయన పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. ఈ సమావేశానికి రాష్ట్ర బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి కూడా హాజరయ్యారు. కాగా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్‌గా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.