Jammu Kashmir: రాజౌరిలో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల కాల్పులు
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి దారుణానికి ఒడిగట్టారు.సైనికులు ప్రయాణిస్తున్న వాహనంపై అకస్మాత్తుగా కాల్పులు ప్రారంభించారు.
ఈ ఘటన జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా సుందర్‌బానీ ప్రాంతంలో చోటు చేసుకుంది.
దట్టమైన అటవీ ప్రాంతంలో దాగి ఉన్న ఉగ్రవాదులు,ఆర్మీ వాహనంపై విచక్షణా రహితంగా దాడికి తెగబడ్డారు. అయితే,వెంటనే అప్రమత్తమైన సైనికులు ఎదురు కాల్పులు జరిపారు.
ఉగ్రవాదులు సైనిక వాహనంపై సుమారు 3నుంచి 4రౌండ్ల వరకు కాల్పులు జరిపినట్లు సమాచారం.
ఈ ఘటన అనంతరం ఆ ప్రాంతాన్ని పూర్తిగా అధీనంలోకి తీసుకున్న భద్రతా దళాలు,ఉగ్రవాదుల జాడను కనుగొనేందుకు దట్టమైన అటవీ ప్రాంతంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి.
అయితే,ఈ కాల్పుల్లో ఎవరైనా గాయపడ్డారా లేదా ప్రాణాలు కోల్పోయారా అనే విషయంపై అధికారులు ఇంకా స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆర్మీ వాహనంపై అకస్మాత్తుగా కాల్పులు జరిపిన ఉగ్రవాదులు
Terrorists Fire At Army Vehicle In Jammu And Kashmir’s Rajouri#jammukashmir #rajouri pic.twitter.com/OAxA5kfQqb
— Jammu Tribune (@JammuTribune) February 26, 2025