Page Loader
నాగాలాండ్ ముఖ్యమంత్రిగా ఎన్‌డీపీపీ అధినేత నీఫియు రియో ​​ప్రమాణ స్వీకారం
నాగాలాండ్ ముఖ్యమంత్రిగా ఎన్‌డీపీపీ అధినేత నీఫియు రియో ​​ప్రమాణ స్వీకారం

నాగాలాండ్ ముఖ్యమంత్రిగా ఎన్‌డీపీపీ అధినేత నీఫియు రియో ​​ప్రమాణ స్వీకారం

వ్రాసిన వారు Stalin
Mar 07, 2023
03:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

నాగాలాండ్ ముఖ్యమంత్రిగా నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్‌డీపీపీ) నేత నీఫియు రియో ​​మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. కొహిమాలో జరిగిన ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, నాగాలాండ్ గవర్నర్ లా గణేశన్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ హాజరయ్యారు. నాగాలాండ్ ఉప ముఖ్యమంత్రులుగా తాడితుయ్ రంగ్‌కౌ జెలియాంగ్, యంతుంగో పాటన్ ప్రమాణ స్వీకారం చేశారు.

నాగాలాండ్

ఐదోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన రియో

నాగాలాండ్ రాజకీయ ప్రముఖుడు, సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నీఫియు రియో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. దీంతో ఆయన బీజేపీ మద్దతుతో వరుసగా ఐదవసారి ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టారు. 60మంది సభ్యులున్న అసెంబ్లీలో ఎన్‌డీపీ-బీజేపీ కూటమి 37సీట్లు సాధించడంతో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. నాగాలాండ్ అసెంబ్లీ చరిత్రను తిరగరాస్తూ.. తొలిసారిగా ఈ సారి ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు ఎన్నిక కావడం గమనార్హం. అధికార ఎన్‌డిపీపీకి చెందిన హెఖానీ జఖాలు, క్రూసే పశ్చిమ అంగామి, దిమాపూర్-III నుంచి విజయం సాధించారు. 60 సంవత్సరాల రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేపారు.