Page Loader
ఎన్నికల ఫలితాలు: నాగాలాండ్, త్రిపురలో కమల వికాసం; మేఘాలయలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన ఎన్‌పీపీ
నాగాలాండ్, త్రిపురలో కమల వికాసం; మేఘాలయలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన ఎన్‌పీపీ

ఎన్నికల ఫలితాలు: నాగాలాండ్, త్రిపురలో కమల వికాసం; మేఘాలయలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన ఎన్‌పీపీ

వ్రాసిన వారు Stalin
Mar 02, 2023
07:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ, దాని మిత్ర పక్షాలు విజయకేతాన్ని ఎగురవేశాయి. నాగాలాండ్‌లో ఎన్‌డీపీపీ, త్రిపురలో ఐపీఎఫ్‌టీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. మేఘాలయలో తిరిగి అధికారంలోకి రావడానికి ఎన్‌పీపీతో బీజేపీ జత కట్టింది. మేఘాలయలో హంగ్ ఉన్నప్పటికీ, సీఎం కాన్రాడ్ సంగ్మా ఆధ్వర్యంలోని ఎన్‌పీపీ ఇప్పటికే 20 స్థానాల్లో గెలిచింది. మరో ఆరుస్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అవి కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఎన్‌పీపీ మేఘాలయాలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ముకుల్ సంగ్మాకు ఆధ్వర్యంలోని టీఎంసీ ఐదు స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ ఐదు సీట్లలో, యూడీపీ 11స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ రెండు స్థానాలను గెల్చుకుంది. మేఘాలయలో ఏ పార్టీకి కూడా పూర్తిస్థాయి మెజార్టీ దక్కలేదు.

అసెంబ్లీ ఎన్నికలు

నాగాలాండ్‌లో ఎన్డీపీపీ-బీజేపీ కూటమికి రెండోసారి అధికారం, త్రిపురలో బీజేపీ భారీ విజయం

నాగాలాండ్‌లో ఎన్‌డీపీపీ 25, బీజేపీ 12 స్థానాలు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. నలుగురు స్వతంత్ర అభ్యర్థులు విజయం నమోదు చేయగా, జనతాదళ్ (యునైటెడ్) ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), నాగా పీపుల్స్ ఫ్రంట్ చెరో రెండు సీట్లు గెలుచుకున్నాయి. ఎన్‌పీపీ ఐదు, ఎన్‌సీపీ ఆరు సీట్లను కైవసం చేసుకున్నాయి. త్రిపురలో బీజేపీ అఖండ విజయం సాధించింది. 32 సీట్లతో తిరిగి అధికారంలోకి వచ్చింది. సొంతంగా మ్యాజిక్ ఫిగర్‌ను ఇక్కడ దాటిసింది. బీజేపీ మిత్రపక్షం ఐపీఎఫ్‌టీ ఒక స్థానాన్ని నిలుపుకుంది. సీపీఎం 11సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ మూడు స్థానాలను కైవసం చేసుకుంది. టీఎంపీ 13నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం సాధించింది.