Delhi: ఢిల్లీని కప్పేసిన దట్టమైన పొగమంచు .. 50 విమానాలు, 30 రైళ్లుపై సర్వీసులకు తీవ్ర అంతరాయం
దేశ రాజధాని దిల్లీని మంగళవారం కూడా దట్టమైన పొగమంచు కమ్మేసింది. భారత వాతావరణ శాఖ ప్రకారం,దేశ రాజధాని సఫ్దర్‌జంగ్‌లో 4.8 డిగ్రీల సెల్సియస్, పాలంలో ఉష్ణోగ్రత 7.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. విజిబిలిటీ తగ్గిపోవడంతో, ఢిల్లీ నుంచి బయలుదేరే దాదాపు 30 విమానాలు ఆలస్యమవగా,మరో 17 విమానాలు రద్దయ్యాయని ఎయిర్‌పోర్టు వర్గాలను ఉటంకిస్తూ వార్తా సంస్థ ANI నివేదించింది. దాదాపు 30 రైళ్లు కూడా ఈరోజు ఢిల్లీకి ఆలస్యంగా చేరుకున్నాయి. ఇదిలా ఉండగా, మంగళవారం దట్టమైన పొగమంచు కారణంగా విమానాలు, రైలు కార్యకలాపాలపై ప్రభావం చూపడంతో ఢిల్లీ విమానాశ్రయం,రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు వేచి ఉన్నారు. భారత వాతావరణ శాఖ ప్రకారం,"ఢిల్లీ పాలం (VIDP),సఫ్దర్‌జంగ్ విమానాశ్రయాలు ఈరోజు ఉదయం 500 మీటర్ల విజిబిలిటీని నివేదిస్తున్నాయి.
పొగమంచు కారణంగా, మూడు విమానాలు రద్దు
ఢిల్లీ,ఉత్తరప్రదేశ్,హర్యానా, చండీగఢ్,పంజాబ్‌లలో రేపటి (మంగళవారం) వరకు చాలా దట్టమైన పొగమంచు కొనసాగుతుందని సోమవారం వాతావరణ శాఖ ఉదయం బులెటిన్ తెలిపింది. అంతేకాకుండా, మంగళవారం వరకు ఉత్తర భారతదేశం అంతటా చలి నుండి తీవ్రమైన చలి పరిస్థితులు కూడా అంచనా వేయబడ్డాయి. ఇక, ఉత్తర భారతదేశంలో దట్టమైన పొగమంచు కారణంగా, మూడు విమానాలు రద్దు చెయ్యగా , మరో మూడు చండీగఢ్‌లో ఆలస్యం అయ్యాయి. ఇదిలా ఉండగా, నగరంలోని ప్రాథమిక పాఠశాలలను జనవరి 20 తర్వాత మూసివేయాలని ఆదేశించారు. అయితే, 10, 11, 12 తరగతుల పాఠశాలలు ఉదయం 9.30 గంటల తర్వాత తెరుస్తారు. విపరీతమైన చలి పరిస్థితుల నేపథ్యంలో, పంజాబ్,హర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.