Page Loader
మణిపూర్‌లో 'నీట్ యూజీ 2023' పరీక్ష వాయిదా 
మణిపూర్‌లో 'నీట్ యూజీ 2023' పరీక్ష వాయిదా

మణిపూర్‌లో 'నీట్ యూజీ 2023' పరీక్ష వాయిదా 

వ్రాసిన వారు Stalin
May 06, 2023
04:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

మణిపూర్‌లో హింస నేపథ్యంలో పరీక్షా కేంద్రాలు కేటాయించిన అభ్యర్థులకు నీట్ (యూజీ)-2023 పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వాయిదా వేసింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. వాయిదా పడిన పరీక్షల తదుపది తేదీలను త్వరలో ప్రకటిస్తామని ఎన్‌టీఏ వెల్లడించింది. మణిపూర్‌లో పరిస్థితి ఆందోళనకంగా ఉండటంతో పరీక్షను రీషెడ్యూల్ చేసే అవకాశాన్ని పరిశీలించాలని అభ్యర్థిస్తూ ఎన్‌టీఏకు ఆ రాష్ట్ర విద్యాశాఖ సహాయ మంత్రి డాక్టర్ రాజ్‌కుమార్ రంజన్ సింగ్ లేఖ రాశారు. పరీక్ష వాయిదా పడిన విషయాన్ని అభ్యర్థులకు ఆటోమేటిక్ కాల్,ఇమెయిల్ ద్వారా కూడా తెలియజేస్తామని ఎన్‌టీఏ తెలిపింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన నోట్