NEET: జార్ఖండ్‌లో నీట్-పేపర్ లీక్ కేసులో సీబీఐ రెండో అరెస్టు
జార్ఖండ్ లోని ధన్‌బాద్‌లో నీట్-యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ రెండో అరెస్టు చేసింది. అమిత్ కుమార్ సింగ్ అలియాస్ బంటీని గురువారం అర్థరాత్రి అదుపులోకి తీసుకున్నారు.తదుపరి విచారణ కోసం పాట్నాకు తరలించారు. NEET-UGపరీక్ష రాసిన వారి నుండి సేకరించిన సమాచారం ఆధారంగా బంటీని అరెస్టుచేసినట్లు పోలీసువర్గాలు తెలిపాయి . బుధవారమే స్లీత్‌లు బంటీని అరెస్ట్ చేటానికి ప్రయత్నించగా తప్పించుకున్నాడు.అయితే ఎట్టకేలకు అతని ఎలక్ట్రానిక్ డివైస్ ఆధారంగా మరుసటి రోజు రాత్రి ఝరియా ప్రాంతంలో అతడిని గుర్తించారు. నీట్ భారతదేశంలో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులు,దంత విద్యా కోర్సులు చదవాలనుకునే విద్యార్థుల కోసం పెట్టే ప్రవేశ పరీక్ష. భారతదేశంలోని ప్రభుత్వ,ప్రైవేటు కళాశాలలన్నిటికీ ఈపరీక్ష వర్తిస్తుంది.దీన్ని గతంలో ఆల్ ఇండియా ప్రీ-మెడికల్ టెస్ట్ అనేవారు.