LOADING...
Indian fisherman: పాకిస్థాన్‌ జైల్లో భారతీయులపై నిర్లక్ష్యం: మరో మత్స్యకారుడు మృతి
పాకిస్థాన్‌ జైల్లో భారతీయులపై నిర్లక్ష్యం: మరో మత్స్యకారుడు మృతి

Indian fisherman: పాకిస్థాన్‌ జైల్లో భారతీయులపై నిర్లక్ష్యం: మరో మత్స్యకారుడు మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 25, 2025
09:45 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగా భారత మత్స్యకారుడి ప్రాణం బలైంది. శిక్షా కాలం ముగిసినా, విడుదల చేయడంలో జాప్యం కారణంగా ఓ భారతీయుడు పాకిస్థాన్‌ జైలులోనే మరణించాడు. గత రెండేళ్లలో పాకిస్థాన్‌ కస్టడీలో భారత మత్స్యకారులు మరణించడం ఇది ఎనిమిదో ఘటనగా నమోదు కావడం గమనార్హం. 2022లో పాకిస్థాన్‌ అధికారులు భారత మత్స్యకారుడు బాబును ఓ కేసులో అరెస్టు చేసి, కరాచీలోని జైలుకు తరలించారు. అక్కడ అతని శిక్షా కాలం పూర్తయింది. అయినా పాక్‌ అధికారులు అతడిని విడుదల చేయడంలో నిర్లక్ష్యం వహించారు. ఈ క్రమంలో జనవరి 23న బాబు జైల్లోనే ప్రాణాలు కోల్పోయినట్లు భారత అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే అతడి మరణానికి గల స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు.

Details

పాక్ జైల్లో 180 మంది మత్స్యకారులు

ఇటీవల కాలంలో పాకిస్థాన్‌ జైళ్లలో భారత మత్స్యకారులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు పునరావృతమవుతున్నాయి. జైళ్లలో ఖైదీలపై పాక్‌ అధికారుల ప్రవర్తన, ఆరోగ్య పరమైన శ్రద్ధలేకపోవడం వంటి అంశాలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత రెండేళ్లలో ఇలాంటి మరణాలు ఎనిమిది చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం, భారతదేశానికి చెందిన సుమారు 180 మంది మత్స్యకారులు పాకిస్థాన్‌ జైళ్లలో శిక్షా కాలం ముగిసినా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. పాక్‌ అధికారులు పలు కారణాలతో వారి విడుదలను నిరంతరం ఆలస్యం చేస్తున్నారు. దీనిపై భారత్‌ తరచూ చర్చలు జరుపుతున్నా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఈ ఘటనలు పాకిస్థాన్‌ జైళ్లలోని పరిస్థితులపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.