Page Loader
Netflix: IC 814 సిరీస్‌ వివాదంపై దిగివచ్చిన నెట్‌ఫ్లిక్స్.. మనోభావాలకు దెబ్బతీయమని హామీ 
IC 814 సిరీస్‌పై వివాదంపై దిగివచ్చిన నెట్‌ఫ్లిక్స్.. మనోభావాలకు దెబ్బతీయమని హామీ

Netflix: IC 814 సిరీస్‌ వివాదంపై దిగివచ్చిన నెట్‌ఫ్లిక్స్.. మనోభావాలకు దెబ్బతీయమని హామీ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 03, 2024
01:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

1999లో ఖాట్మాండు నుండి న్యూ దిల్లీకి వెళ్తున్న ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ విమానం ఐసీ 814ను ఐదుగురు ఇస్లామిక్ ఉగ్రవాదులు హైజాక్ చేశారు. ఈ ఉగ్రవాదులు పాకిస్తాన్‌కు చెందిన హర్కత్ ఉల్ ముజాహిదీన్ సభ్యులు. హైజాక్ అనంతరం విమానాన్ని ఆఫ్ఘనిస్తాన్‌లోని కాందహార్‌కు తీసుకెళ్లారు. భారతీయ ప్రయాణికుల ప్రాణాలు కాపాడటానికి, అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని భారత ప్రభుత్వం, జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజార్ సహా ముగ్గురు ఉగ్రవాదులను విడుదల చేసింది. ఈ కథ ఆధారంగా నెట్‌ప్లిక్స్ సిరీస్'IC 814 కాందహార్ హైజాక్' రూపొందించింది.

Details

సమన్లు జారీ చేసిన కేంద్రం

అయితే ఇది వివాదాస్పదమైంది. దీంతో నెట్‌ఫ్లిక్స్ మనోభావాలను దెబ్బతీయమని హామీ ఇచ్చింది. ఈ విషయాన్ని నెట్‌ ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ హెడ్ మోనికా షెర్గిల్, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో తెలిపారు. తమ ప్లాట్‌ఫారమ్‌లో ఉన్న కంటెంట్‌కి సమీక్షను నిర్వహిస్తుందని, భవిష్యత్‌లో దేశ ప్రజల మనోభావాలకు, పిల్లల సున్నితత్వానికి అనుగుణంగా ఉంటుందని హామీ ఇచ్చింది. ఈ సిరీస్‌లో ఐదుగురు హైజాకర్లలో ఇద్దరికి హిందూ పేర్లు 'భోలా' 'శంకర్' గా పిలవడంపై అభ్యంతరాలు తలెత్తాయి. దీంతో కేంద్రం కూడా నెట్‌ప్లిక్స్ సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ బ్యాన్ చేయాలని దిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది.