LOADING...
Telangana: పోలీసింగ్‌ బలోపేతానికి ఏఎస్‌ఎస్‌జీపీ కొత్త గ్రిడ్‌ వ్యవస్థ ప్రారంభం

Telangana: పోలీసింగ్‌ బలోపేతానికి ఏఎస్‌ఎస్‌జీపీ కొత్త గ్రిడ్‌ వ్యవస్థ ప్రారంభం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 28, 2025
09:27 am

ఈ వార్తాకథనం ఏంటి

సీసీ కెమెరాలు పనిచేయకపోవడం లేదా మరమ్మతుల్లో ఆలస్యం జరగడం వల్ల కేసుల పరిశీలనలో పోలీసులకు ఇబ్బందులు ఎదురుకావడం సాధారణమైంది. ఈ సమస్యను శాశ్వతంగా అధిగమించడానికి సీపీ సజ్జనార్‌ తాజా సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. 'అడ్వాన్స్‌డ్‌ సిటీ సర్వైలెన్స్‌ గ్రిడ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోటోకాల్‌' (ACSGP) పేరుతో స్థిరమైన పర్యవేక్షణ వ్యవస్థను ప్రారంభించారు. సీసీ కెమెరాలలో వచ్చే చిన్నా-పెద్ద సమస్యలను రోజులు వేచి చూడకుండా వెంటనే పరిష్కరించి, పోలీస్‌ వ్యవస్థను మరింత బలపరచడం ఈ ప్రోటోకాల్‌ ఉద్దేశ్యం.

వివరాలు 

'ICE' - వ్యవస్థలో కీలక భాగం 

ACSGP వ్యవస్థలో 'ఎంపవరింగ్‌ యోర్‌ ఎవ్రీడే సేఫ్టీ' (ICE) అనే విభాగం అత్యంత ప్రధానమైనది. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో పోలీసుల ఆధ్వర్యంలో 16 వేలకు పైగా సీసీ కెమెరాలు అమర్చి ఉన్నాయి. ఇవి లోపం వచ్చినప్పుడు మరమ్మతులు ఆలస్యమవుతుండటంతో సమస్యలు తలెత్తుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా 'ICE' వెంటనే స్పందించే విధంగా ఏర్పాటు చేయబడింది. ఏ ప్రాంతంలోనైనా కెమెరా పనిచేయకుండా పోతే, ఒప్పంద సంస్థ రాకుండా 'ICE' ప్రత్యేక బృందమే తక్షణ మరమ్మతులు చేస్తుంది. పెద్ద సమస్యలైనా పరిష్కరించడానికి సాంకేతికంగా శిక్షణ పొందిన 14 మంది నిపుణులను నియమించి, వారికి వాహనాలు, అవసరమైన రిపేర్‌ కిట్లు అందించారు.

వివరాలు 

టెక్నాలజీ డ్యూ విజిలెన్స్‌ బృందం..

సీసీ కెమెరాల కొనుగోలు, ఇన్‌స్టాలేషన్‌, నిర్వహణ వంటి అంశాల్లో ఏ ప్రమాణాలు పాటించాలో నిర్ధారించడం ఈ బృందం పని. టెక్‌ కంపెనీలు, ఇన్నోవేషన్‌ హబ్‌లతో కలిసి కొత్త సాంకేతిక పరిష్కారాలను గుర్తించడం కూడా వీరి బాధ్యత. స్టోర్‌ టీమ్‌.. సీసీ కెమెరాల మరమ్మతులకు కావాల్సిన స్పేర్‌ పార్ట్స్‌ను కొనుగోలు చేసి నిల్వ ఉంచడం, వాటి నిర్వహణను చూసుకోవడం, ఫీల్డ్‌ బృందాలకు అవసరమైన విడిభాగాలను పంపడం ఈ విభాగం చేపడుతుంది. రిపేర్‌ సెంటర్‌.. కెమెరాలపై సాంకేతిక తనిఖీలు చేసి, అవసరమైతే అక్కడికక్కడే మరమ్మతులు చేయడం ఈ కేంద్రం పని. సీసీ కెమెరాలు అందించిన సంస్థల సర్వీస్‌ సెంటర్లతో నేరుగా అనుసంధానమై పనిచేస్తుంది.

Advertisement

వివరాలు 

డేటా అనలిటిక్స్‌ విభాగం 

ప్రతిరోజూ నగరవ్యాప్తంగా ఎన్ని సీసీ కెమెరాలు ఎలా పనిచేస్తున్నాయో విశ్లేషిస్తుంది. సేకరించిన రికార్డింగ్‌ల నుంచి నేర నియంత్రణకు ఉపయోగపడే సమాచారాన్ని వెలికితీసి, సంబంధిత శాఖలకు సూచనలు అందిస్తుంది. CSR డెస్క్‌ ఈ విభాగం హైదరాబాద్‌ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్‌తో కలిసి పనిచేస్తూ, సామాజిక బాధ్యత కార్యక్రమాలకు మద్దతు అందిస్తుంది.

Advertisement

వివరాలు 

కెమెరా సపోర్ట్‌ కాల్‌సెంటర్‌ 

క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న పోలీసులు, బ్లూకోల్ట్స్‌, పెట్రోలింగ్‌ సిబ్బంది ఎక్కడైనా కెమెరా పనిచేయకపోతే వెంటనే ఫిర్యాదు చేయగలిగేలా ఈ కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇది 'డయల్‌ 100' తరహాలోనే పనిచేస్తుంది. ఫిర్యాదు అందిన వెంటనే ఫీల్డ్‌ టీమ్‌ అక్కడికి చేరుకొని మరమ్మతులు చేస్తుంది. సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు అనుసంధానం కొనసాగుతుంది. అలాగే ఎవరైనా సీసీ కెమెరాలను విరాళంగా ఇవ్వాలనుకున్నా, ఇదే కాల్‌సెంటర్‌ను సంప్రదించవచ్చు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సీపీ సజ్జనార్‌ చేసిన ట్వీట్ 

Advertisement