LOADING...
New Flight Service: విజయవాడ నుంచి హైదరాబాద్‌కు కొత్త విమాన సర్వీస్ ప్రారంభం
విజయవాడ నుంచి హైదరాబాద్‌కు కొత్త విమాన సర్వీస్ ప్రారంభం

New Flight Service: విజయవాడ నుంచి హైదరాబాద్‌కు కొత్త విమాన సర్వీస్ ప్రారంభం

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 10, 2026
09:59 am

ఈ వార్తాకథనం ఏంటి

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు మరో కొత్త విమాన సర్వీసును కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. 2024లో ప్రారంభమైన ఫ్లై91 సంస్థ ఉడాన్ పథకం కింద క్రమంగా అభివృద్ధి చెందుతూ దక్షిణాది రాష్ట్రాల్లో విస్తృతంగా విమాన సేవలు అందిస్తోందని ఆయన తెలిపారు. ఈ నెల 17వ తేదీ నుంచి హైదరాబాద్ కేంద్రంగా 22 రాకపోకల సర్వీసులు నిర్వహించేందుకు ముందుకు వచ్చిన సంస్థ నిర్వాహకులను అభినందించారు. త్వరలో దుబాయ్, వారణాసి, కొచ్చి వంటి ప్రాంతాలకు కూడా సేవలు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

వివరాలు 

జూన్ నాటికి భోగాపురం నిర్మాణ పనులు

విజయవాడ, రాజమహేంద్రవరం, కడప విమానాశ్రయాల అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. విశాఖపట్నం సమీపంలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు జూన్ నాటికి పూర్తవుతాయని, జూలైలో ప్రధాని నరేంద్ర మోదీ మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

వివరాలు 

ఏప్రిల్ 17 నుంచి మరో సర్వీసు

గోవా కేంద్రంగా దేశవ్యాప్తంగా ప్రాంతీయ విమాన సేవలు అందిస్తున్నఈ సంస్థకు చెందిన సర్వీసును స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తో కలిసి రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ప్రయాణికులకు బోర్డింగ్ పాస్‌లు అందజేసి ప్రారంభించారు. రాష్ట్రంలో విజయవాడతో పాటు రాజమండ్రి విమానాశ్రయం నుంచి తొలుత హైదరాబాద్‌కు ఈ సంస్థ సర్వీసులు ప్రారంభిస్తోంది. విజయవాడ నుంచి ఉదయం 7.30 గంటలకు బయలుదేరే విమానం హైదరాబాద్‌కు 8.40 గంటలకు చేరుకుంటుంది. అదనంగా, ఏప్రిల్ 17 నుంచి మరో సర్వీసును కూడా విజయవాడ నుంచి హైదరాబాద్‌కు నడపనున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement