LOADING...
VB G RAM G: ఉపాధి హామీకి కొత్త రూపం.. ఏప్రిల్‌లో 'వీబీ జీ రామ్‌ జీ' ప్రారంభం 
ఉపాధి హామీకి కొత్త రూపం.. ఏప్రిల్‌లో 'వీబీ జీ రామ్‌ జీ' ప్రారంభం

VB G RAM G: ఉపాధి హామీకి కొత్త రూపం.. ఏప్రిల్‌లో 'వీబీ జీ రామ్‌ జీ' ప్రారంభం 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 03, 2026
09:16 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు ఉపాధి హామీ పథకాన్ని పాత విధానంలోనే అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏప్రిల్‌ నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచే 'వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్, ఆజీవికా మిషన్‌ (గ్రామీణ)' — 'వీబీ జీ రామ్‌ జీ' అమలులోకి రానుంది. ఈ విషయాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ అధికారికంగా వెల్లడించింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (నరేగా)లో మార్పులు చేసి కేంద్ర ప్రభుత్వం కొత్తగా 'వీబీ జీ రామ్‌ జీ' పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఇది ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందన్న అంశంపై ఇప్పటివరకు స్పష్టత లేకపోవడంతో రాష్ట్రాల్లో సందిగ్ధత నెలకొంది.

Details

 60శాతం వాటా ఇవ్వనున్న కేంద్ర ప్రభుత్వం

కొత్త విధానం ప్రకారం లేబర్‌, మెటీరియల్‌ బడ్జెట్‌తో పాటు పరిపాలనా ఖర్చులకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు భరించాల్సి ఉంటుంది. కాగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే తొమ్మిది నెలలు పూర్తయ్యాయి. ఈ పరిస్థితిలో మిగిలిన మూడు నెలలకు కొత్త విధానంలోనే కేంద్రం బడ్జెట్‌ కేటాయిస్తుందా? లేక మార్చి నెలాఖరు వరకు పాత విధానమే కొనసాగిస్తుందా? అన్న అంశంపై స్పష్టత ఇవ్వాలని పలు రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాల పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులు ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఏప్రిల్‌ 1 నుంచి 'వీబీ జీ రామ్‌ జీ' అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు.

Advertisement