LOADING...
కేంద్రం మరో కీలక నిర్ణయం.. కొత్త పార్లమెంట్‌లో సిబ్బందికి కొత్త యూనిఫాం
కొత్త పార్లమెంట్‌లో సిబ్బందికి కొత్త యూనిఫాం

కేంద్రం మరో కీలక నిర్ణయం.. కొత్త పార్లమెంట్‌లో సిబ్బందికి కొత్త యూనిఫాం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 12, 2023
05:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 2023 ఈనెల 18న ప్రారంభం కానున్నాయి.కొత్త పార్లమెంట్‌ లోకి వెళ్లే క్రమంలో సిబ్బంది ప్రత్యేకంగా యూనిఫాం ధరించనున్నారు.నిఫ్ట్ (NIFT) ప్రత్యేకంగా ఈ యూనిఫాంను రూపొందించింది. ఇది నెహ్రూ జాకెట్ మాదిరిగా ఊదా ఎరుపు రంగులో లేదా గులాబీ రంగులో ఉంటుంది. చొక్కాలు మాత్రం పువ్వుల డిజైన్‌తో ముదురు గులాబీ రంగులో ఉండనున్నాయి. పార్లమెంట్ ఉద్యోగులు ధరించే ప్యాంట్లు ఖాకీ రంగులో ఉండనున్నాయి. మరోవైపు ఉభయ సభల్లోనూ మణిపురి తలపాగాలు ధరించేలా డిజైన్ చేశారు.భద్రతా సిబ్బందికి సఫారీ సూట్లకు బదులు మిలటరీ దుస్తుల డిజైన్‌ ఉంటుందని తెలుస్తోంది. సెప్టెంబర్ 18న పాత భవనంలో తొలుత ప్రత్యేక సమావేశాలు ప్రారంభమై, వినాయక చవితిని పురస్కరించుకుని 19న కొత్త భవనంలోనే సమావేశాలను నిర్వహించనున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

భద్రతా సిబ్బందికి సఫారీ సూట్లకు బదులు మిలటరీ దుస్తులు