Page Loader
New Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి తేదీ ఖరారు 
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి తేదీ ఖరారు

New Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి తేదీ ఖరారు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 11, 2025
05:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పంపిణీకి తుది తేదీని నిర్ణయించింది. జూలై 14న తుంగతుర్తి ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈపంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ దశలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2.4లక్షల కొత్త రేషన్ కార్డులు లబ్ధిదారులకు అందించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ కొత్త జాబితాలో సుమారు 11.30లక్షల మంది ప్రజలకు ఈ ప్రయోజనం అందబోతోంది. గత ఆరు నెలల కాలంలో ప్రభుత్వం 41లక్షల మందికి రేషన్ సరఫరా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నూతనంగా జారీ చేయబోయే కార్డులతో కలిపి రాష్ట్రంలో రేషన్ కార్డుల మొత్తం సంఖ్య 94,72,422కి పెరిగే అవకాశం ఉంది. దీని ద్వారా మొత్తం 3.14కోట్ల మంది ప్రజలకు రేషన్ పథకం లబ్ధి చేకూరనుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీకి ముహూర్తం ఫిక్స్