Inter Exams: ఇంటర్ బోర్డు నూతన నిబంధన.. ఈసారి అలస్యమైనా అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు ఈసారి ఆలస్య నిబంధనలో మార్పు చేసింది. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఐదు నిమిషాలు, అంటే ఉదయం 9.05 గంటల వరకు విద్యార్థులను అనుమతిస్తారు.
అయినా సరే ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవడం మంచిదని ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య సూచించారు.
తల్లిదండ్రులు తమ పిల్లలు సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకునేలా చూడాలని ఆయన కోరారు.
ఈనెల 5న ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నేపథ్యంలో బోర్డు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పరీక్షల విభాగం కంట్రోలర్ జయప్రద బాయి, సంయుక్త కార్యదర్శులు భీమ్‌సింగ్, మోహన్, జ్యోత్స్య తదితరులతో కలిసి ఆయన మాట్లాడారు.
Details
ప్రశ్నపత్రాలపై క్యూఆర్ కోడ్
నిబంధనల ప్రకారం ఉదయం 8.45 గంటల నుంచి 9 గంటల మధ్యలో ఓఎంఆర్ షీట్‌ను విద్యార్థులు పూర్తి చేయాలన్నారు.
హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్ ముద్రించారు. దాన్ని స్కాన్ చేసి పరీక్షా కేంద్రం లొకేషన్‌ను తెలుసుకోవచ్చు. ఈసారి ప్రతి ప్రశ్నపత్రంపై సీరియల్ నంబరు ఉంటుంది.
దాని ద్వారా ఏ ప్రశ్నపత్రం ఏ విద్యార్థికి వెళ్తుందో గుర్తించవచ్చు. ఒకవేళ ప్రశ్నపత్రం బయటకు వచ్చినా, ఏ కేంద్రం, ఏ విద్యార్థిదో తేల్చేస్తారు.
ఇంటర్మీడియట్ పరీక్షలకు మొత్తం 9,96,971 మంది విద్యార్థులున్నారు.
ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 4,88,448 మంది, సెకండ్ ఇయర్ విద్యార్థులు 5,08,523 మంది ఉన్నారు. ఇందులో అబ్బాయిలు 4,97,528, మంది, అమ్మాయిలు 4,99,443 మంది ఉన్నారు.