GHMC : హైదరాబాద్‌లో కొత్త టూరిస్ట్ స్పాట్.. మీర్ ఆలం చెరువుపై 2.4 కిలోమీటర్ల బ్రిడ్జి!
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ నగరంలోని మీర్ ఆలం చెరువుపై నిర్మించే బ్రిడ్జిని నగరంలోని ప్రముఖ ఆకర్షణగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
చిన్న పిల్లలను దృష్టిలో ఉంచుకుని, బ్రిడ్జి పరిసర ప్రాంతాలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సూచించారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై సమీక్ష
శనివారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చేపడుతున్న పలు ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు.
2.4 కిలోమీటర్ల పొడవైన మీర్ ఆలం చెరువు బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి అధికారులు మూడు రకాల ప్రతిపాదనలు సమర్పించారు.
Details
30 నెలల్లో నిర్మాణం పూర్తి
అధికారుల ప్రతిపాదనలను సమీక్షించిన సీఎం, 90 రోజుల్లో డీపీఆర్ (డీటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్) సిద్ధం చేసి, 30 నెలల్లో బ్రిడ్జి నిర్మాణం పూర్తిచేయాలని ఆదేశించారు.
అదే విధంగా, నగరంలోని ఫ్లైఓవర్ల ప్రణాళికపై లోతుగా అధ్యయనం చేసి, రోడ్ల విస్తరణ పనులను వేగవంతం చేయాలని సూచించారు.
మీర్ ఆలం చెరువును టూరిస్ట్ స్పాట్‌గా అభివృద్ధి
మీర్ ఆలం చెరువును పర్యాటక కేంద్రంగా మార్చేందుకు భారీ ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
హెచ్ఎండీఏ ఇప్పటికే అనుమతులు జారీ చేయగా, కేబుల్ బ్రిడ్జి లేదా సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం యోచిస్తోంది.
Details
మూడు రకాల ప్రతిపాదనలు పరిశీలనలో
మూడు రకాల ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి.
అందులో సాధారణ వంతెన కోసం రూ. 375 కోట్లు, తీగల వంతెన కోసం రూ. 1200 కోట్లు, కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి కోసం రూ. 1900 కోట్లు ఖర్చు చేయనున్నారు.
తుది నిర్ణయంపై త్వరలో ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. బ్రిడ్జి పూర్తయితే, రాకపోకలు మెరుగుపడి ట్రాఫిక్ తగ్గే అవకాశముంది.