Page Loader
హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు
హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు

హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 16, 2023
01:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

యూఏపీఏ కేసులో అరెస్ట్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై న్యూస్‌ క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ, హ్యూమన్ రిసోర్సెస్ హెడ్ అమిత్ చక్రవర్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత వారం,జస్టిస్ తుషార్ రావు నేతృత్వంలోని ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం పుర్కాయస్థ, చక్రవర్తి అభ్యర్థనలలోఎటువంటి మెరిట్ లేదని పేర్కొంది.ఇద్దరి అరెస్టు,తదుపరి పోలీసు రిమాండ్‌లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. న్యూస్‌ క్లిక్,వారి జర్నలిస్టులకి సంబంధించిన దాదాపు 88 ప్రదేశాలపై దాడులు చేసిన దిల్లీ పోలీసులు పుర్కాయస్థ,చక్రవర్తిని అరెస్టు చేశారు. ,

Details

ఢిల్లీలోని న్యూస్‌ క్లిక్ కార్యాలయానికి  సీలు

FIR ప్రకారం,భారతదేశ సార్వభౌమత్వానికి విఘాతం కలిగించడం,దేశంపై అసంతృప్తిని కలిగించడానికి చైనా నుండి విదేశీ నిధులను అందుకున్నారని వారు ఆరోపించారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రక్రియను విధ్వంసం చేయడానికి పీపుల్స్ అలయన్స్ ఫర్ డెమోక్రసీ అండ్ సెక్యులరిజం (PADS)తో కలిసి పుర్కాయస్థ కుట్ర పన్నారని కూడా ఆరోపించింది. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అనుమానితులపై, డేటా విశ్లేషణలో బయటపడిన వారిపై అక్టోబర్ 3న ఢిల్లీలోని 88 చోట్ల, ఇతర రాష్ట్రాల్లో ఏడు ప్రాంతాల్లో దాడులు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం మొత్తం 46 మంది జర్నలిస్టులు,న్యూస్‌క్లిక్‌కు కంట్రిబ్యూటర్‌లను విచారించగా వారి మొబైల్ ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని న్యూస్‌క్లిక్ కార్యాలయానికి కూడా సీలు వేశారు.