Page Loader
News Click: కశ్మీర్, అరుణాచల్‌లు భారతదేశంలో భాగం కావని న్యూస్‌క్లిక్ ప్రమోట్ చేసింది : పోలీసులు 
కశ్మీర్, అరుణాచల్‌లు భారతదేశంలో భాగం కావని న్యూస్‌క్లిక్ ప్రమోట్ చేసింది : పోలీసులు కశ్మీర్, అరుణాచల్‌లు భారతదేశంలో భాగం కావని న్యూస్‌క్లిక్ ప్రమోట్ చేసింది : పోలీసులు

News Click: కశ్మీర్, అరుణాచల్‌లు భారతదేశంలో భాగం కావని న్యూస్‌క్లిక్ ప్రమోట్ చేసింది : పోలీసులు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 05, 2023
02:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

'న్యూస్ క్లిక్' కార్యాలయంలో, ఆ సంస్థ ప్రాతికేయుల నివాసాల్లో దిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం మంగళవారం పెద్ద ఎత్తున్న సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. చైనాకు అనుకూలంగా ప్రచారం నిర్వహించినందుకే ఈ పోర్టల్ కు ప్రత్యేక నిధులు అందుతున్నాయనే ఆరోపణలపై ఇది వరకే కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా కాశ్మీర్, అరుణాచల్ లు భారత్ దేశంలో భాగం కావని న్యూస్ క్లిక్ ప్రమోట్ చేసిందని దిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం ఆరోపణలు చేసింది. అమెరికన్ మిలియనీర్ నెవిల్లే రాయ్ సింఘమ్, సింఘమ్ యాజమాన్యంలోని షాంఘైకి చెందిన స్టార్‌స్ట్రీమ్ కంపెనీకి చెందిన మరికొందరు చైనా ఉద్యోగులు ఈమెయిల్‌లను మార్చుకున్నారని వారు స్పష్టం చేశారు.

Details

న్యూస్ క్లిక్ కేసులో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం

భారత ప్రభుత్వ ప్రయత్నాలను అప్రతిష్టపాలు చేయడానికి ఒక తప్పుడు కథనం ప్రచురించిందని, 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రక్రియను దెబ్బతీయడానికి పీపుల్స్ అలయన్స్ ఫర్ డెమోక్రసీ అండ్ సెక్యులరిజం (PADS) అనే గ్రూప్‌తో ప్రబీర్ పుర్కాయస్థ కుట్ర పన్నాడని స్పెషల్ సెల్ రిమాండ్ తెలిపింది. అంతకుముందు ఈ కేసులో న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ, హెడ్ అమిత్ చక్రవర్తి అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రస్తుతం విచారణ కొనసాగుతుండటంతో మరిన్ని కీలక పరిమాణాలు చోటు చేసుకొనే అవకాశం ఉంది.