Page Loader
నిజామాబాద్ ఉగ్రవాద కుట్ర కేసు: పీఎఫ్‌ఐ వెపన్ ట్రైనర్‌ను అరెస్టు చేసిన ఎన్ఐఏ 
నిజామాబాద్ ఉగ్రవాద కుట్ర కేసు: పీఎఫ్‌ఐ వెపన్ ట్రైనర్‌ను అరెస్టు చేసిన ఎన్ఐఏ

నిజామాబాద్ ఉగ్రవాద కుట్ర కేసు: పీఎఫ్‌ఐ వెపన్ ట్రైనర్‌ను అరెస్టు చేసిన ఎన్ఐఏ 

వ్రాసిన వారు Stalin
Jun 14, 2023
07:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటకలో తప్పుడు గుర్తింపు పత్రాలో నివసిస్తున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) మాస్టర్ వెపన్ ట్రైనర్‌ మొహమ్మద్ యూనస్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బుధవారం అరెస్టు చేసింది. నిజామాబాద్‌ ఉగ్రదాడి కుట్ర కేసులో యూనస్‌‌కు ప్రమేయం ఉన్నట్లు ఎన్ఐఏ అనుమానిస్తోంది. 2022 లో అతని నివాసాన్ని ఎన్ఐఏ సోదా చేసినప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. యూనస్ తన కుటుంబంతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటకకు మకాం మార్చి, అక్కడ బషీర్‌గా పేరు మార్చుకొని ప్లంబర్ పని చేస్తున్నాడు. పీఎఫ్‌ఐ ద్వారా రిక్రూట్ అయిన యువతకు యూనస్ ఆయుధ శిక్షణ ఇచ్చినట్లు ఎన్ఐఏ అభియోగాలు మోపింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పీఎఫ్‌ఐ ద్వారా రిక్రూట్ అయిన యువతకు యూనస్‌‌ ఆయుధ శిక్షణ