LOADING...
West Bengal:మిడ్నాపూర్ జిల్లాలో ఎన్ఐఏ దాడులు
West Bengal:మిడ్నాపూర్ జిల్లాలో ఎన్ఐఏ దాడులు

West Bengal:మిడ్నాపూర్ జిల్లాలో ఎన్ఐఏ దాడులు

వ్రాసిన వారు Stalin
Apr 06, 2024
11:45 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్ లోని తూర్పు మిడ్నాపూర్ జిల్లాలో ని భూపతినగర్ లో జాతీయ నేర దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శనివారం ఉదయం దాడులు చేపట్టింది. 2022లో తృణమూల్ కాంగ్రెస్‌ నేత ఇంటి సమీపంలో జరిగిన బాంబు పేలుడు ఘటనకు సంబంధించి విచారణ చేసేందుకు ఎన్ఐఏ అక్కడకు చేరుకోగా వారిపై ఇటుకలు, రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఒక అధికారి గాయపడ్డారు. కాాగా ఎన్ఐఏ టీమ్ సోదాలు చేసేముందుకు స్థానిక పోలీస్ స్టేషన్ కు ముందుగానే సమాచారమిచ్చినప్పటికీ అక్కడ సరైన భద్రతను స్థానిక పోలీసులు కల్పించలేకపోయారని ఇండియా టుడే వెల్లడించింది. 2022 డిసెంబర్ 3న భూపతినగర్ లో ని ఓ ఇంటిలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.

BJP

దీని వెనుక బీజేపీ ప్రమేయం ఉంది: కునాల్ ఘోష్

ఈ ఘటనకు సంబంధించి గతనెలలో ఎన్ఐఏ టీమ్ ఎనిమిది మంది టీఎంసీ నేతలకు నోటీసులు పంపించింది. ఈ ఎనిమిది టీెఎంసీ నేతలు ఎన్ఐఏ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులలో పేర్కొంది. కాగా, ఎన్ఐఏ టీెెఎంసీ నేతలకు నోటీసులు పంపడం వెనుక బీజేపీ హస్తంగా ఉండొచ్చని టీెఎంసీ నేత కునాల్ ఘోష్ ఆరోపించారు. మనబేంద్ర జానాతోపాటు మరొక వ్యక్తి పై ఎన్ఐఏ స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడం వెనుక కచ్చితంగా బీజేపీ ప్రమేయం ఉందని కునాల్ ఘోష్ ఆరోపించారు. అందుకే టీఎంసీ నేతలను అరెస్ట్ చేసేందుకు ఎన్ఐఏ ప్రయత్నిస్తోందని విమర్శించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎన్ఐఏపై దాడి దృశ్యాలు