
Nidhi Tewari :ప్రధానమంత్రి మోదీ ప్రైవేట్ కార్యదర్శిగా నిధి తివారీ నియామకం.. ఆమె ఎవరంటే..!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రైవేట్ కార్యదర్శిగా నిధి తివారీని కేంద్ర ప్రభుత్వం నియమించింది.
ఈ విషయంపై అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2022 నవంబర్ నుంచి ప్రధానమంత్రి కార్యాలయం (PMO)లో డిప్యూటీ సెక్రటరీ హోదాలో నిధి తివారీ పనిచేస్తున్నారు.
అంతకుముందు, విదేశాంగ మంత్రిత్వ శాఖలో అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల విభాగంలో అండర్ సెక్రటరీగా సేవలు అందించారు.
తాజాగా, మోడీ ప్రైవేట్ కార్యదర్శిగా ఆమె నియమితులయ్యారు.
వివరాలు
మూడో ప్రైవేట్ కార్యదర్శిగా నిధి తివారీ
నిధి తివారీ 2013 సివిల్ సర్వీసెస్ పరీక్షలో 96వ ర్యాంక్ సాధించారు. ఆమె వారణాసిలోని మెహముర్‌గంజ్ ప్రాంతానికి చెందినవారు. సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించే ముందు, ఆమె వారణాసిలో అసిస్టెంట్ కమిషనర్ (కమర్షియల్ ట్యాక్స్)గా పనిచేశారు.
ఉద్యోగం చేస్తూనే సివిల్ పరీక్షకు సిద్ధమై విజయాన్ని సాధించారు. ఇప్పటి వరకు ప్రధానమంత్రికి ఇద్దరు ప్రైవేట్ కార్యదర్శులు ఉన్నారు - వివేక్ కుమార్, హార్దిక్ సతీశ్చంద్ర షా.
ఇప్పుడు మూడో ప్రైవేట్ కార్యదర్శిగా నిధి తివారీ నియమితులయ్యారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రైవేట్ కార్యదర్శిగా నిధి తివారీ
Nidhi Tewari appointed as Private Secretary to Prime Minister Narendra Modi. pic.twitter.com/erpTlJfjfn
— Press Trust of India (@PTI_News) March 31, 2025