LOADING...
Nishant Kumar: పాలిటిక్స్‌లోకి నిషాంత్‌ కుమార్‌..? తేజస్వి యాదవ్‌ ఏమన్నారంటే!
పాలిటిక్స్‌లోకి నిషాంత్‌ కుమార్‌..? తేజస్వి యాదవ్‌ ఏమన్నారంటే!

Nishant Kumar: పాలిటిక్స్‌లోకి నిషాంత్‌ కుమార్‌..? తేజస్వి యాదవ్‌ ఏమన్నారంటే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 23, 2025
11:17 am

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ కుమారుడు నిషాంత్‌ కుమార్‌ రాజకీయాల్లోకి రావాలని భావిస్తే, అది సంతోషకరమని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ అన్నారు. జేడీయూ పార్టీని బీజేపీ నుంచి కాపాడే సామర్థ్యం నిషాంత్‌కు ఉందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. తాజాగా నిషాంత్‌ కుమార్‌ ప్రజలకు పిలుపునిస్తూ తన తండ్రి నితీశ్‌ కుమార్‌ 100 శాతం ఫిట్‌గా ఉన్నారని, రానున్న బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు జేడీయూను బలపరచాలని కోరిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన తేజస్వి యాదవ్‌ మాట్లాడుతూ నితీశ్‌కుమార్‌తో పోలిస్తే తమ తండ్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ మరింత ఫిట్‌గా ఉన్నారు.

Details

మండల కమిషన్ సిఫారసులను అమలు చేయడంలో లాలూ కీలక పాత్ర

బిహార్‌లో బలహీన వర్గాల కోసం లాలూ చేసిన సేవను ఎవ్వరూ చేయలేరు. మండల్‌ కమిషన్‌ సిఫారసులను అమలు చేయడంలో కూడా లాలూ ప్రసాద్‌ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. అలాగే, నిషాంత్‌ రాజకీయాల్లోకి రావడం మంచిదేనని అభిప్రాయపడ్డ తేజస్వి, అయితే అతను ముందుగా పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నానని వ్యాఖ్యానించారు.