LOADING...
Nitin Nabin: బీజేపీకు నూతన సారథి.. జాతీయ అధ్యక్షుడిగా నితిన్‌ నబీన్‌ ఏకగ్రీవ ఎన్నిక
జాతీయ అధ్యక్షుడిగా నితిన్‌ నబీన్‌ ఏకగ్రీవ ఎన్నిక

Nitin Nabin: బీజేపీకు నూతన సారథి.. జాతీయ అధ్యక్షుడిగా నితిన్‌ నబీన్‌ ఏకగ్రీవ ఎన్నిక

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 19, 2026
05:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ జనతా పార్టీకి (BJP) కొత్త సారథి వచ్చారు.పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ సిన్హా సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక జేపీ నడ్డా అధ్యక్ష పదవీకాలం ముగియడంతో జరిగింది. మంగళవారం ఉదయం 11 గంటలకు ఆయన అధికారికంగా పార్టీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. బిహార్‌కు చెందిన 46 ఏళ్ల నితిన్ నబీన్, గతేడాది డిసెంబర్‌లో భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించబడ్డారు. అప్పటి వార్తల ప్రకారం,ఆయనను పార్టీ కొత్త అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని అధిష్ఠానం భావించిందని తెలిపారు.

వివరాలు 

బిహార్ నుండి అతి పెద్ద స్థాయికి చేరిన తొలి నాయకుడు 

కాయస్థ సామాజికవర్గానికి చెందిన నబీన్ సిన్హాకు ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం కూడా ఉంది. గతేడాది జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బాంకీపుర్ నుంచి ఆయన నాలుగవ సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బిహార్ రాష్ట్రం నుండి పార్టీలో అతి పెద్ద స్థాయికి చేరిన తొలి నాయకుడిగా నితిన్ నబీన్ సిన్హా గుర్తింపు పొందారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బీజేపీకు నూతన సారథి

Advertisement