Page Loader
Manipur: బీజేపీకి నితీష్ కుమార్ జేడీయూ షాక్.. మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణ..
బీజేపీకి నితీష్ కుమార్ జేడీయూ షాక్.. మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణ..

Manipur: బీజేపీకి నితీష్ కుమార్ జేడీయూ షాక్.. మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణ..

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 22, 2025
04:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

బీజేపీ ప్రభుత్వానికి బిహార్ సీఎం నితీష్ కుమార్ ఓ షాక్ ఇచ్చారు. ఆయన నేతృత్వంలోని జేడీయూ మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. సీఎం బీరెన్ సింగ్ ప్రభుత్వానికి జేడీయూకి చెందిన ఒక ఎమ్మెల్యే జేడీయూకి ఉన్న ఒక ఎమ్మెల్యే మద్దతుని విత్ డ్రా చేసుకుని ప్రతిపక్షంలో చేరడానికి సిద్ధపడ్డారు. అయితే, ఈ పరిణామం అక్కడి ప్రభుత్వంపై పెద్దగా ప్రభావం చూపించదని.. బీజేపీ ప్రభుత్వ మెజారిటిపై దాదాపుగా ఎలాంటి ఎఫెక్ట్ పడదు.

వివరాలు 

జేడీయూకి 12 మంది ఎంపీలు

కేంద్రంలో బీజేపీకి జేడీయూ మంచి మద్దతుదారుగా ఉంది. గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి స్వయంగా మెజారిటీ సాధించలేదు. జేడీయూ, టీడీపీ వంటి పార్టీలు ఎన్డీయే కూటమికి బలంగా మద్దతు ఇచ్చి మ్యాజిక్ ఫిగర్‌ను అందించాయి. ప్రస్తుతం జేడీయూకి 12 మంది ఎంపీలు ఉన్నారు, వీరు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. అయితే, ఈ పరిణామం బీజేపీకి ఒక హెచ్చరికగా మారిందనే చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు, బిరెన్ సింగ్ ప్రభుత్వానికి మేఘాలయా అధికార పార్టీ కన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని ఎన్‌పీపీ కూడా గత నెలలో మద్దతు ఉపసంహరించుకుంది.

వివరాలు 

మణిపూర్ అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీకి 37 మంది శాసనసభ్యులు

మణిపూర్ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ 6 సీట్లు గెలుచుకుంది. కానీ ఎన్నికల అనంతరం ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. 60 మంది సభ్యులతో ఉన్న మణిపూర్ అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీకి 37 మంది శాసనసభ్యులు ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ 31 కావడంతో, నాగా పీపుల్స్ ఫ్రంట్‌కి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రుల మద్దతు కూడా బీజేపీకి ఉంది. మొత్తంగా, ఎన్డీయే ప్రభుత్వానికి 45 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. దీంతో, ప్రస్తుతం మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు.