Narayanamurthy: నమ్మకం లేదు.. కోచింగ్ క్లాసులపై నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు
తరగతి గదిలో పాఠాల పట్ల శ్రద్ధ చూపని విద్యార్థులకే కోచింగ్ క్లాసులు అవసరమవుతాయని, ఉత్తీర్ణత కోసం అవి తప్పుడు మార్గంగా ఉపయోగపడుతున్నాయని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి పేర్కొన్నారు. బెంగళూరులో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యల అంశంపై నారాయణమూర్తి స్పందించారు. కోచింగ్ క్లాస్‌లకు వెళ్లేవారు తరచుగా తరగతి గదిలో శ్రద్ధ పెట్టని వారేనని చెప్పారు. దీనివల్ల ఆలోచనా శక్తి తగ్గడంతో పాటు వాస్తవ సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన సామర్థ్యాన్ని దెబ్బతీస్తోందన్నారు.
క్రమశిక్షణతో కూడిన వాతావరణాన్ని తల్లిదండ్రులు కల్పించాలి
ఏదైనా నేర్చుకోవడంలో పరిశీలన, విశ్లేషణ, అన్వయన, ధృవీకరణ ప్రాధాన్యం కలిగి ఉంటేనే అసలు విద్యా చెప్పారు. విద్యార్థులు సాధారణంగా ఆలోచించి సమస్యలను పరిష్కరించే విధానాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. పిల్లలు చదువుకోవడానికి ఇంట్లో క్రమశిక్షణతో కూడిన వాతావరణాన్ని తల్లిదండ్రులు కల్పించాలన్నారు. తల్లిదండ్రులు పుస్తకాలు పట్టుకుని చదివితే పిల్లలు కూడా అదే దిశగా ఆలోచించి ముందుకు సాగుతారన్నారు.