LOADING...
Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్ర మార్గాల్లో 'నో ఫ్లై జోన్' విధింపు… ఎప్పటి నుంచి అంటే..!
అమర్‌నాథ్ యాత్ర మార్గాల్లో 'నో ఫ్లై జోన్' విధింపు… ఎప్పటి నుంచి అంటే..!

Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్ర మార్గాల్లో 'నో ఫ్లై జోన్' విధింపు… ఎప్పటి నుంచి అంటే..!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 17, 2025
02:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతిష్టాత్మకమైన అమర్‌నాథ్ యాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి పహల్గామ్‌, బల్టల్‌ మార్గాలపై 'నో ఫ్లై జోన్‌' విధించనున్నట్లు మంగళవారం అధికారికంగా ప్రకటించారు. యాత్రికుల భద్రత కోణంలో ఇది అత్యంత కీలక చర్యగా అధికారులు చెబుతున్నారు.

Details

ఎందుకు 'నో ఫ్లై జోన్?

కేంద్ర హోంశాఖ (MHA) సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. పహల్గామ్‌, బల్టల్‌ యాత్ర మార్గాల్లో డ్రోన్లు, యూఏవీలు (UAVs), గాలిపటాలు సహా ఎలాంటి వైమానిక వస్తువుల ఉపయోగాన్ని పూర్తిగా నిషేధించారు. భద్రతా విభాగాలు, వైద్య అవసరాల కోసం ఉపయోగించే హెలికాప్టర్లకు మాత్రం ఈ నిబంధన వర్తించదని స్పష్టం చేశారు. పిలిగ్రిమ్స్ భద్రతకే ప్రాధాన్యత ఈ ఏడాది లక్షలాది మంది భక్తులు హిమాలయాల్లో జరిగే వార్షిక అమర్‌నాథ్ యాత్రలో పాల్గొనబోతున్న నేపథ్యంలో, భద్రతా విభాగాలు గట్టి చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా డ్రోన్‌ల ద్వారా ఉగ్రవాదులు దాడులు చేయవచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో, యాత్ర మార్గాల్లో ఎలాంటి వైమానిక కదలికలను అనుమతించరాదన్నదే ఈ నిషేధం ఉద్దేశ్యం.

Details

భద్రతా దృష్టితో ముందస్తు చర్యలు 

డ్రోన్‌లను వాడుకుని ఉగ్ర శక్తులు ప్రమాదం సృష్టించే అవకాశం ఉన్న నేపథ్యంలో, భక్తుల రక్షణే లక్ష్యంగా నో ఫ్లై జోన్ విధిస్తున్నాం. ఇది భద్రతా ప్రోటోకాల్‌లో భాగమని అధికారులు స్పష్టం చేశారు. పహల్గామ్‌, బల్టల్‌ మార్గాలు ప్రధానంగా యాత్రికులు ప్రయాణించే మార్గాలు కావడంతో ఇవి ప్రత్యేకంగా ఎంపికయ్యాయి. హెలికాప్టర్లకు మినహాయింపు ఈ నిబంధన వైద్య సహాయం, సహాయ చర్యలు, భద్రతా విభాగాల అవసరాల కోసం ఉపయోగించే హెలికాప్టర్లకు మాత్రం వర్తించదని అధికారులు తెలిపారు. కానీ ప్రైవేట్ డ్రోన్లు, కమర్షియల్ UAVలు, గాలిపటాలు, ఇతర ప్రయోగాత్మక వైమానిక పరికరాలపై పూర్తి నిషేధం ఉంటుందని తెలిపారు.