తదుపరి వార్తా కథనం

Annual Toll pass: ఇక ఫాస్టాగ్ రీఛార్జ్ అవసరం లేదు.. రూ.3,000 వార్షిక టోల్‌పాస్ నేటి నుంచే అమలు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 15, 2025
09:09 am
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులు, జాతీయ ఎక్స్‌ప్రెస్‌వేలపై ప్రయాణించే వాణిజ్యేతర వాహనదారుల కోసం రూ.3,000 వార్షిక టోల్‌పాస్‌ను శుక్రవారం నుంచి అమల్లోకి తెస్తోంది. ఈ పాస్‌ను యాక్టివేట్ చేసుకోవడానికి రాజ్‌మార్గ్ యాత్ర యాప్‌లో అధికారులు ఒక లింక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అదనంగా భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ), రహదారి రవాణా, హైవే మంత్రిత్వశాఖ వెబ్‌సైట్లలో కూడా ఈ లింక్ లభిస్తుంది. కార్లు, జీపులు, వ్యాన్లు, ఇతర వాణిజ్యేతర వాహనాలకు మాత్రమే ఈ పాస్ వర్తిస్తుంది. దీని వల్ల టోల్ చెల్లింపుల కోసం ఫాస్టాగ్ కార్డులను పదేపదే రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ పాస్‌తో సంవత్సరానికి 200 ట్రిప్పుల వరకు జాతీయ రహదారులపై ప్రయాణం చేసుకోవచ్చు.