Telangana: రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్
ఈ వార్తాకథనం ఏంటి
అర్హులైనా రుణమాఫీ కానీ రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
రుణమాఫీ కానీ రైతుల ఫిర్యాదులు స్వీకరించేందుకు అన్ని మండలకేంద్రాల్లో నోడల్ అధికారులను నియమించినట్లు వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి రఘునందన్‌రావు ప్రకటన జారీ చేశారు.
రైతుల నుంచి కంప్లైంట్స్ స్వీకరించటంతో పాటు వాటిని పరిష్కరించి రైతులకు మాఫీ వర్తింపజేస్తామని చెప్పారు.
రైతువేదికల్లోని రైతులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. రైతులు తమ ఆధార్ కార్డులోని సమాచారం,సంబంధిత బ్యాంకు వద్ద నమోదైన డేటాలో చిన్నచిన్న తప్పులు,రైతు పట్టాదారు పాస్‌పుస్తకాల సమస్యలుపేరు సరిగా లేకపోవడం వంటి ఫిర్యాదులను ఆయా మండలాల్లోని నోడల్ అధికారికి అందజేయాలన్నారు.
మండల వ్యవసాయాధికారి కార్యాలయాలతో పాటు రైతువేదికల్లో మంగళవారం నుంచి ఫిర్యాదుల స్వీకరణ ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు.