LOADING...
TG News: తెలంగాణలో నేడు గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ 
తెలంగాణలో నేడు గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్

TG News: తెలంగాణలో నేడు గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 25, 2025
03:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌, అధికారిక నోటిఫికేషన్‌ ఇవాళ సాయంత్రం విడుదల కానున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ 31 జిల్లాలకు చెందిన 545 గ్రామీణ మండలాల్లోని 12,760 పంచాయతీలు, 1,13,534 వార్డులకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్‌ను ప్రకటించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో, పంచాయతీరాజ్‌ శాఖ, ఎన్నికల సంఘం అవసరమైన ఏర్పాట్లను చేపట్టాయి. సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణికుమిదిని మీడియాతో సమావేశమై పూర్తి వివరాలు తెలియజేయనున్నారు.

వివరాలు 

కాసేపట్లో ఎన్నికల పిటిషన్లపై హైకోర్టులో విచారణ 

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన పలు పిటిషన్లపై విచారణ ఈరోజు మధ్యాహ్నం 2.15 గంటలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు జరగనుంది. అసలు ఈ విచారణ సోమవారం పూర్తవ్వాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల మంగళవారానికి వాయిదా పడింది. పాత రిజర్వేషన్ల ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ పంచాయతీరాజ్‌ శాఖ ఇప్పటికే రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌కు నివేదికను సమర్పించింది. ఇదిలా ఉండగా, ఈరోజు జరిగే రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో పంచాయతీ ఎన్నికల తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది. మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలన్న ఎన్నికల సంఘం ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలించినట్లు సమాచారం.