LOADING...
hyderabad -vijayawada Highway: హైదరాబాద్-విజయవాడ హైవే ఆరు లేన్ల విస్తరణకు కేంద్ర అనుమతి
హైదరాబాద్-విజయవాడ హైవే ఆరు లేన్ల విస్తరణకు కేంద్ర అనుమతి

hyderabad -vijayawada Highway: హైదరాబాద్-విజయవాడ హైవే ఆరు లేన్ల విస్తరణకు కేంద్ర అనుమతి

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 05, 2025
12:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌ నుండి విజయవాడ వరకు సాగుతున్న 65వ జాతీయ రహదారిని విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ హైవేలో 40వ కిలోమీటరు నుంచి 269వ కిలోమీటరు వరకు, మొత్తం 229 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం ఉన్న నాలుగు లేన్లను ఆరు లేన్లుగా మార్చేందుకు భూసేకరణ అవసరం. ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో సంబంధిత అధికారులను నియమిస్తూ కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

వివరాలు 

తెలంగాణలో..

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలో 9 గ్రామాలు, నల్గొండ జిల్లాలో చిట్యాల మండలంలో 5, నార్కెట్‌పల్లి మండలంలో 5, కట్టంగూరు మండలంలో 4, నకిరేకల్‌లో 2, కేతేపల్లి మండలంలో 4 గ్రామాలు, సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట మండలంలో 4, చివ్వెంల మండలంలో 6, కోదాడ మండలంలో 4, మునగాల మండలంలో 5 గ్రామాల్లో భూసేకరణ బాధ్యతలను ఆయా ప్రాంతాల RDOలకు అప్పగించారు.

వివరాలు 

ఆంధ్రప్రదేశ్‌లో..

ఎన్టీఆర్‌ జిల్లాలో నందిగామ మండలంలో 4, కంచికచర్ల మండలంలో 4, జగ్గయ్యపేటలో 7, పెనుగంచిప్రోలు మండలంలో 3, ఇబ్రహీంపట్నం మండలంలో 12 గ్రామాలు, విజయవాడ రూరల్‌లో 1, విజయవాడ వెస్ట్‌లో 2, విజయవాడ నార్త్‌ పరిధిలో 1 గ్రామం లో భూసేకరణను సంబంధిత జాయింట్‌ కలెక్టర్లకు అప్పగించారు.