LOADING...
NEET UG Results 2025: నీట్‌ యూజీ 2025 పరీక్ష ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ తెలుసుకోండిలా..
నీట్‌ యూజీ 2025 పరీక్ష ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ తెలుసుకోండిలా..

NEET UG Results 2025: నీట్‌ యూజీ 2025 పరీక్ష ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ తెలుసుకోండిలా..

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 14, 2025
02:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న నీట్‌ (యూజీ) ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్స్‌ ఎంట్రన్స్‌ టెస్ట్ (NEET UG 2025) ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) శనివారం ప్రకటించింది. ఈ ఏడాది మే 4న జరిగిన పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ ఇటీవలే విడుదల చేసిన ఎన్‌టీఏ, విద్యార్థుల అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం తుది ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థులు తమ ఫలితాలను తెలుసుకోవాలంటే తమ రిజిస్టర్డ్‌ ఈమెయిల్‌ ఐడీలను పరిశీలించాల్సిందిగా ఎన్‌టీఏ సూచించింది. లేదా వారి వ్యక్తిగత లాగిన్‌ వివరాల్లోకి వెళ్లి అప్లికేషన్‌ నంబర్‌ ద్వారా స్కోర్‌కార్డ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పేర్కొంది.

వివరాలు 

సత్తా చాటిన తెలుగు విద్యార్థులు.. 

ఈసారి ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 41,584 మంది విద్యార్థులు నీట్‌లో అర్హత సాధించగా, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 36,776 మంది విద్యార్థులు అర్హతను గెలుచుకున్నారు. తెలంగాణకు చెందిన కాకర్ల జీవన్‌ సాయికుమార్‌ జాతీయ స్థాయిలో 18వ ర్యాంక్‌ను సాధించగా, షణ్ముఖ నిషాంత్‌ 37వ ర్యాంక్‌,మంగరి వరుణ్‌ 46వ ర్యాంక్‌,యండ్రపాటి షణ్ముఖ్‌ 48వ ర్యాంక్‌ను సంపాదించారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన దర్బా కార్తీక్‌రామ్‌ 19వ ర్యాంక్‌, కొడవటి మోహిత్‌ శ్రీరామ్‌ 56వ ర్యాంక్‌ను పొందారు.

వివరాలు 

పరీక్షకు భారీ స్పందన 

ఎంబీబీఎస్‌ (MBBS), బీడీఎస్‌ (BDS), బీఎస్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ వంటి వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్ష మే 4న నిర్వహించారు. దేశవ్యాప్తంగా సుమారు 20 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరైనట్టు అధికారులు తెలిపారు. నీట్‌ స్కోర్‌ కార్డు కోసం క్లిక్‌ చేయండి https://examinationservices.nic.in/resultservices/Neet2025/Login