LOADING...
NTR: దార్శనికత ఉన్న నాయకుడు 'ఎన్టీఆర్‌' : ప్రధాని మోదీ 
దార్శనికత ఉన్న నాయకుడు 'ఎన్టీఆర్‌' : ప్రధాని మోదీ

NTR: దార్శనికత ఉన్న నాయకుడు 'ఎన్టీఆర్‌' : ప్రధాని మోదీ 

వ్రాసిన వారు Sirish Praharaju
May 28, 2025
10:17 am

ఈ వార్తాకథనం ఏంటి

నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్)జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ ఎక్స్​లో పోస్ట్​చేశారు. ఎన్టీఆర్ సినిమారంగంలో గొప్ప నటుడే కాకుండా, ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పాత్రలు పోషించినవారని మోదీ గుర్తు చేశారు. ఆయనలో ఉన్న ప్రజ్ఞ, దార్శనికత ఆయనను విశిష్ట నాయకుడిగా నిలిపినదని ప్రశంసించారు. రామారావు అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని,బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంకితభావంతో పని చేశారని మోదీ తెలిపారు. తనకూ ఎన్టీఆర్ జీవితం,సేవల నుంచి ఎంతో ప్రేరణ లభించిందని పేర్కొన్నారు. అంతేకాక,ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా ఎన్టీఆర్ కలల్ని నెరవేర్చే దిశగా కృషి చేస్తోందని ఆయన తన ట్వీట్‌లో తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నరేంద్ర మోదీ  చేసిన ట్వీట్