LOADING...
Parliament: పార్లమెంట్‌ గజ ద్వారం వద్ద 'నంబర్‌ 1' చెట్టు.. వీవీఐపీ భద్రతకు సవాల్!
పార్లమెంట్‌ గజ ద్వారం వద్ద 'నంబర్‌ 1' చెట్టు.. వీవీఐపీ భద్రతకు సవాల్!

Parliament: పార్లమెంట్‌ గజ ద్వారం వద్ద 'నంబర్‌ 1' చెట్టు.. వీవీఐపీ భద్రతకు సవాల్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 23, 2025
03:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొత్త పార్లమెంట్‌ భవనంలోని ఆరు ప్రధాన ప్రవేశ ద్వారాల్లో గజ ద్వారం ఒకటి. ప్రధాని నరేంద్రమోదీ తరచూ ఈ ద్వారం గుండా సభలోకి వెళ్తారు. అయితే ఈ గేటు వద్ద పసుపు పూల చెట్టు ఉండటం భద్రతాపరమైన సమస్యలకు దారితీస్తోంది. 'నంబర్‌ 1 ట్రీ'గా గుర్తింపబడ్డ ఈ చెట్టు విపరీతంగా పెరిగి వీవీఐపీల రాకపోకలకు అడ్డంకిగా మారింది. స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్‌పీజీ) ఈ సమస్యను గుర్తించి, చెట్టును ప్రస్తుత స్థలం నుంచి తరలించాలని నిర్ణయించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ (సీపీడబ్ల్యూడీ)కి సూచనలు పంపింది. అయితే చెట్టును మార్చాలంటే తప్పనిసరిగా దిల్లీ అటవీ శాఖ అనుమతి అవసరం.

Details

మరో 10 మొక్కలు నాటాలి

అందుకుగాను భద్రతా విభాగం ఇప్పటికే రూ.57వేల సెక్యూరిటీ డిపాజిట్‌ను అటవీశాఖ ఖాతాలో జమ చేసింది. రాబోయే వారం ఈ చెట్టును పార్లమెంట్‌ ప్రాంగణంలోని ప్రేరణ స్థల్‌ వద్దకు తరలించే పనులు జరగనున్నాయి. చెట్టు తరలింపునకు ప్రతిగా సీపీడబ్ల్యూడీ పార్లమెంట్‌ పరిసరాల్లోనే మరో 10 మొక్కలు నాటాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఇక, ఇటీవలే పార్లమెంట్‌ వద్ద భద్రతా లోపం చోటు చేసుకుంది. రెడ్‌ క్రాస్‌ రోడ్డులోని ఐజీ-2 గేటు దగ్గర ఓ వ్యక్తి చెట్టు ఎక్కి పార్లమెంట్‌ ప్రాంగణంలోకి చొరబడ్డాడు. అప్రమత్తమైన సిబ్బంది అతడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమికంగా విచారణలో ఆ వ్యక్తి మానసిక స్థితి సరిగా లేదని నిర్ధారణ అయ్యింది