Panchayat Elections: ఎస్టీలకు పెరిగిన రిజర్వేషన్లు.. పంచాయతీరాజ్ శాఖ నివేదిక
ఈ వార్తాకథనం ఏంటి
పంచాయతీ ఎన్నికల్లో ఎస్టీ వర్గానికి కేటాయించిన స్థానాల సంఖ్య ఈసారి మరింత పెరిగిందని పంచాయతీ రాజ్ శాఖ నివేదిక స్పష్టం చేసింది. 2019లో రాష్ట్రంలో మొత్తం 1,177పంచాయతీలు ఎస్టీలకు రిజర్వ్‌గా ఉండగా,2025 ఎన్నికల నాటికి ఈ సంఖ్య 1,248కుపెరిగింది. షెడ్యూల్ కాని గ్రామ పంచాయతీలలో కూడా ఎస్టీల కోటా పెరిగింది. 2019లో 688స్థానాలు ఉంటే,2025లో అవి 714గానమోదయ్యాయి.అలాగే, 2019తో పోలిస్తే బీసీ రిజర్వేషన్లు ఎనిమిది జిల్లాల్లో పెరిగినట్లు నివేదిక తెలిపింది. నాన్-షెడ్యూల్డ్ పంచాయతీల్లో ఎస్టీ రిజర్వేషన్ పెరగడం ఇతర వర్గాలకు స్వల్పమార్పులు తెచ్చిందని కూడా పేర్కొంది. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో బీసీల రిజర్వేషన్లు వర్తించవని నివేదిక స్పష్టం చేసింది. సర్పంచ్ స్థానాల కేటాయింపులో మండలాన్ని ఒక యూనిట్‌గా,వార్డు రిజర్వేషన్లలో పంచాయతీని యూనిట్‌గా పరిగణిస్తారని వివరించింది.
నివేదిక
నివేదికలో ముఖ్యాంశాలు..
2019 ఎన్నికల సమయంలో మొత్తం 12,751 పంచాయతీలలో 10,293 నాన్-షెడ్యూల్డు గ్రామాలుగా ఉండగా, వీటిలో ఎస్టీలకు 688 సీట్లు (6.68%), ఎస్సీలకు 2,133 (20.53%), బీసీలకు 2,345 (22.78%) కేటాయించారు. 2025 ఎన్నికల నాటికి మొత్తం పంచాయతీ స్థానాలు 12,760గా ఉంటే, వాటిలో 10,233 నాన్-షెడ్యూల్డ్ గ్రామాలు. వీటిలో ఎస్టీల రిజర్వేషన్ 714 (6.99%), ఎస్సీలకు 2,090 (20.45%), బీసీలకు 2,186 (21.39%)గా నిర్ణయించారు. 2019లో సర్పంచ్, వార్డు సభ్యుల మొత్తం స్థానాల్లో 50% రిజర్వేషన్‌లో నుంచి మొదట ఎస్సీ-ఎస్టీ కోటాలను తీసివేసి, మిగిలిన భాగాన్ని బీసీలకు కేటాయించారు.
నివేదిక
నివేదికలో ముఖ్యాంశాలు..
అదే విధంగా, 2025 ఎన్నికల కోసం మొత్తం 50% రిజర్వేషన్ పరిమితిలో ఎస్సీ-ఎస్టీ రిజర్వేషన్లను తీసివేశాక మిగిలిన శాతాన్ని—మిగిలిన శాతమేనా? లేక రాష్ట్రంలో బీసీ జనాభా శాతమా? అనే రెండు పరిమితుల్లో తక్కువదాన్ని తీసుకుని బీసీ రిజర్వేషన్లను నిర్ణయించారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రాన్ని ఒకే యూనిట్‌గా పరిగణించి, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కల్పించాల్సిన సర్పంచ్ స్థానాల సంఖ్యను జిల్లాల వారీగా నిర్ణయించి కలెక్టర్లకు పంపారు. 2025 ఎన్నికల కోసం మాత్రం, సుప్రీంకోర్టు మార్గనిర్దేశాలకు అనుగుణంగా ఏర్పాటైన ప్రత్యేక కమిషన్ మండలాన్ని సర్పంచ్ స్థానాల యూనిట్‌గా, పంచాయతీని వార్డు సభ్యుల యూనిట్‌గా తీసుకుని రిజర్వేషన్ సంఖ్యలను ఖరారు చేసింది.
నివేదిక
నివేదికలో ముఖ్యాంశాలు..
2019లో 214 గ్రామ పంచాయతీలు సమీప పురపాలికల్లో విలీనమయ్యాయి. వీటిలో జనాభా భారీగా ఉండటంతో, పాత పంచాయతీలను విభజించి 223 కొత్త గ్రామ పంచాయతీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ మార్పుల వల్ల పాత-కొత్త పంచాయతీలలో బీసీ జనాభా పంపిణీ మారడమే కాకుండా రిజర్వేషన్ లెక్కలపై కూడా ప్రభావం పడినట్లు నివేదిక చెప్పింది.