Loading...
Amaravati: అమరావతిలో రూ.174 కోట్లతో ఒబెరాయ్‌ గ్రూప్‌ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ ఏర్పాటు
అమరావతిలో రూ.174 కోట్లతో ఒబెరాయ్‌ గ్రూప్‌ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ ఏర్పాటు

Amaravati: అమరావతిలో రూ.174 కోట్లతో ఒబెరాయ్‌ గ్రూప్‌ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ ఏర్పాటు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 13, 2026
01:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమరావతిలో ఒబెరాయ్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో ఫైవ్‌ స్టార్‌ లగ్జరీ హోటల్‌ ఏర్పాటు కానుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,ఒబెరాయ్‌ గ్రూప్‌ (ఈఐహెచ్‌ లిమిటెడ్‌) మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టు ద్వారా రూ.174కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి.అలాగే యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి 400ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. అమరావతిలో లగ్జరీ హోటల్‌ ఏర్పాటుకు సంబంధించి సీఆర్‌డీఏ అధికారులు,ఒబెరాయ్‌ గ్రూప్‌ ప్రతినిధులు అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకాలు చేశారు. ఈ హోటల్‌ ప్రాజెక్టు ద్వారా 150మందికి ప్రత్యక్షంగా,మరో 250మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ,టీజీ భరత్‌, బీసీ జనార్దన్‌రెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఏపీ రాజధానిలో ఒబెరాయ్‌ గ్రూప్‌ భారీ పెట్టుబడులు

ADVERTISEMENT