Page Loader
IT Raids : జార్ఖండ్, ఒడిశాలో కాంగ్రెస్ ఎంపీ నివాసంలో సోదాలు.. రూ.100కోట్లకుపైగా నగదు సీజ్ 
ఆదాయపు పన్ను శాఖ వర్గాల సమాచారం ప్రకారం,

IT Raids : జార్ఖండ్, ఒడిశాలో కాంగ్రెస్ ఎంపీ నివాసంలో సోదాలు.. రూ.100కోట్లకుపైగా నగదు సీజ్ 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 08, 2023
05:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒడిశాలో జార్ఖండ్‌ కాంగ్రెస్‌ నేత, రాజ్యసభ ఎంపీ ధీరజ్‌ సాహు నివాసాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సదరు ఎంపీకి చెందిన ఇంట్లో ఐటీ శాఖ దాడులు చేసింది. ఈ మేరకు శుక్రవారం రూ. 100 కోట్లకుపైగా నగదును స్వాధీనం చేసుకున్నాయి. ఈ వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేసింది. గత బుధవారం నుంచి ఒడిశా,జార్ఖండ్‌లోని సాహు నివాసాలపై ఆదాయపన్నుశాఖ దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో తాజాగా భారీ మొత్తంలో డబ్బు పట్టుబడటం దుమారం రేపుతోంది. ఒడిశాలోని బౌద్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్‌ ప్రాంగణాల్లో దాడులు కొనసాగుతాయని ఆదాయపు పన్ను శాఖ అధికార వర్గాలు వివరించాయి. సంబల్‌పూర్,బోలంగీర్, తితిలాగఢ్,బౌధ్,సుందర్‌ఘర్,రూర్కెలా,భువనేశ్వర్‌లో సోదాలు కొనసాగుతున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రూ.100 కోట్లకు పైగా పట్టుబడ్డ నోట్ల గుట్టలు