Loading...
Sarbananda Sonowal: చమురు నౌకపై క్షిపణి దాడి.. 19 మంది భారతీయ నావికులు సురక్షితం
చమురు నౌకపై క్షిపణి దాడి.. 19 మంది భారతీయ నావికులు సురక్షితం

Sarbananda Sonowal: చమురు నౌకపై క్షిపణి దాడి.. 19 మంది భారతీయ నావికులు సురక్షితం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 13, 2026
08:25 am

ఈ వార్తాకథనం ఏంటి

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) సముద్ర తీరంలో చమురు రవాణా నౌకపై జరిగిన క్షిపణి దాడి కలకలం రేపింది. ఈ ఘటనలో నౌకలో ఉన్న 19 మంది భారతీయ నావికులతో పాటు మొత్తం 22 మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. యూఏఈ కోస్ట్ గార్డ్ సిబ్బంది వెంటనే స్పందించి వారందరినీ కాపాడారు. భారతీయ నావికులెవరికీ గాయాలు కాలేదని కేంద్ర నౌకాయాన,పోర్టులు,జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ వెల్లడించారు. ఈ నెల 11న లైబీరియా జెండాతో ప్రయాణిస్తున్న ముడి చమురు రవాణా నౌక 'ఎంటీ డొమినికా ప్రాస్పెరిటీ' (MT Dominica Prosperity)పై గుర్తుతెలియని క్షిపణి దాడి జరిగింది. యూఏఈలోని మినా సాకర్ పోర్టు సమీపంలో నౌక నిలిచి ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాలు 

సహాయక చర్యలు చేపట్టిన యూఏఈ కోస్ట్ గార్డ్

దాడి కారణంగా నౌకలోని ఇంజిన్ గదిలో మంటలు చెలరేగినట్లు బ్రిటిష్ సముద్ర భద్రతా సంస్థలు వెల్లడించాయి.

సమాచారం అందుకున్న యూఏఈ కోస్ట్ గార్డ్ వెంటనే సహాయక చర్యలు చేపట్టింది.

ఘటనాస్థలికి చేరుకుని నౌకలో ఉన్న మొత్తం 22 మంది సిబ్బందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. వీరిలో 19 మంది భారతీయ నావికులు ఉన్నారు.

ఈ ఘటనపై స్పందించిన కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్.. భారతీయ నావికులంతా క్షేమంగా ఉన్నారని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేశారు.

సిబ్బంది భద్రత, సంక్షేమానికి అవసరమైన సహాయ సహకారాలు అందించే విషయంలో నౌక నిర్వహణ సంస్థతో భారత ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు.

వివరాలు 

మరో నౌకపైనా దాడి

ఇదే రోజు (నవంబర్ 11) సౌదీ అరేబియా జెండాతో ప్రయాణిస్తున్న 'ఎన్‌సీసీ ఫజర్' (NCC FAJR) నౌక కూడా అనుమానాస్పద దాడికి గురైంది.

హర్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ నౌకలో ముగ్గురు భారతీయ నావికులు ఉన్నారు.

వారితో పాటు నౌకలోని ఇతర సిబ్బంది కూడా సురక్షితంగా ఉన్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.

ADVERTISEMENT

వివరాలు 

మరో నౌకపైనా దాడి

మరోవైపు, నవంబర్ 10న 'ఎంటీ ఫుజైరా ఎనర్జీ' (MT Fujairah Energy) అనే లైబీరియా జెండా కలిగిన చమురు రవాణా నౌకపై పర్షియన్ గల్ఫ్‌లో క్షిపణి దాడి జరిగింది.

ఈ ఘటనలో నలుగురు సిబ్బంది గాయపడ్డారు. వారిలో ఒకరు భారతీయ నావికుడు ఉన్నట్లు కేంద్రం తెలిపింది.

మిగిలిన సిబ్బంది క్షేమంగా ఉన్నారని వెల్లడించింది. పశ్చిమాసియాలోని పర్షియన్ గల్ఫ్, హోర్ముజ్ జలసంధి పరిసర ప్రాంతాల్లో చమురు రవాణా నౌకలపై వరుసగా దాడులు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

ఈ పరిణామాలు సముద్ర మార్గాల్లో నౌకల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సర్బానంద సోనోవాల్ చేసిన ట్వీట్ 

ADVERTISEMENT